నందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా అన్నీ మంచి శకునములే. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మే 18వ తేదీన రిలీజ్ అయిన మంచి టాక్ నే సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈసినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 17వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి రానుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ కథ విషయానికి వస్తే ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేష్) కుటుంబాల మధ్య నాలుగు తరాల నుండి గొడవలు ఉంటాయి. మరోవైపు దివారకర్ తమ్ముడు సుధాకర్ (నరేష్) కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) అదే రోజున ప్రసాద్ కు మూడో కూతురు ఆర్య (మాళవిక నాయర్) పుడతారు. అయితే ఒక తప్పిదం వల్ల పిల్లలు ఇద్దరూ మారిపోతారు. ఒకరి ఇంట్లో మరొకరు పెరుగుతారు. ఇక పెద్దయ్యాక ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ క్రమంలోనే రిషికి ఆర్య మీద ప్రేమ కలుగుతుంది. అయితే వారిద్దరి మధ్య ఓ బిజినెస్ కారణం చేత గొడవ జరుగుతుంది. మరి ఆ తరువాత ఏ జరిగింది..? రిషి తన ప్రేమను ఆర్యకు చెప్పాడా?లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న గొడవ ఎలా ముగిసింది..? తమ పిల్లలు మారిపోయారని తెలిసిన తరువాత ప్రసాద్, దివాకర్ కుటుంబాల్లో జరిగిన పరిస్థితులు ఏంటి అనేది ఈసినిమా కథ..
కాగా ఈసినిమాలో వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ ఈసినిమాను నిర్మించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందించగా.. మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: