నటసింహం బాలకృష్ణ కూడా ప్రస్తుతం అఖండ, వీరసింహారెండ్డి హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు మరోపక్క ఫ్యాన్స్ బాలయ్య హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10 వ తేదీ కావడంతో ఇప్పటినుండే ఇప్పటినుండే సందడి మొదలైంది. దీనిలో భాగంగానే ముందుగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. ఈసినిమా టైటిల్ ను ముందునుండే భగవంత్ కేసరి గా ఫిక్స్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక అదే కన్ఫామ్ చేస్తూ నిన్న ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి గా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రేపు బాలకృష్ణ పుట్టినరోజు నాడు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. టీజర్ జూన్ 10వ తేదీన ఉదయం 10 గంటల 19 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా 108 థియోటర్లలో రిలీజ్ చేయనున్నారు.
Muhurtham Fix💥
Get Ready for the Mass Feast from#BhagavanthKesari 🔥
TEASER LAUNCH TOMORROW at 10:19 AM IST 🤩
In 108 Theatres Worldwide💥#NandamuriBalakrishna@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/qphCw181yC— Shine Screens (@Shine_Screens) June 9, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: