ప్రస్తుతం ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఆదిపురుష్ సినిమా ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా జూన్ 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, జైశ్రీరామ్ సాంగ్ ఇంకా పలు అప్ డేట్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మరోవైపు అప్పుడే ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో మొదలు పెట్టేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు అమెరికాలో భారీ డిమాండ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట. ఇక తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ డేట్ ను, వేదికను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6 వ తేదీన తిరుపతిలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
🔔 Get ready for a cinematic pilgrimage like no other ⏰ ✨
Mark your calendars for June 6th as #Adipurush descends upon the sacred grounds of Tirupati for an epic Pre-Release Event! 🔥
Prepare for an unforgettable journey into the realm of pure cinematic wonder 🔥 🎬… pic.twitter.com/PJ8zaHoubx
— UV Creations (@UV_Creations) May 24, 2023
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.