శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఈసినిమా కలెక్షన్స్ లో కూడా ఎక్కడా తగ్గలేదు. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించి మేకర్స్ లాభాలను సైతం అందించింది.ప్రపంచ వ్యాప్తంగా సుమారు115కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 27వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోని వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు హిందీ వెర్షన్ కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో హిందీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మే 25వ తేదీన హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా…. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: