ఈమధ్య వేరే భాషల్లో రిలీజ్ అయిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పిటికే ఎన్నో సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసినిమా కోనసీమ థగ్స్. ఈసినిమా తమిళ్ సినిమాలో హిట్ అయిన థగ్స్ సినిమా తెలుగు వెర్షన్. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కగా అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. హ్రిదు హరూన్, బాబి సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ తదితరులు..
దర్శకత్వం.. బృందా గోపాల్
బ్యానర్స్.. హెచ్ ఆర్ పిక్చర్స్
నిర్మాత.. రియా షిబు
సంగీతం.. శామ్ సి ఎస్
సినిమాటోగ్రఫి.. పియూష్ గురుస్వామి
కథ..
శేషు (హృదు హరూన్) రౌడీ షీటర్ పెద్దిరెడ్డి దగ్గర పనిచేస్తుంటాడు. అయితే అదే పెద్దిరెడ్డి కుట్రలో భాగంగా శేషు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక జైలులో దొర (బాబి సింహా), మధు (మునీష్ కాంత్) పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి జైలు నుండి తప్పించుకోవడానికి శేషు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు..? ఎలా తప్పించుకున్నారు? పెద్ది రెడ్డి శేషు ను ఇరికించడానికి కారణం ఎంటి? ఇలా పలు విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీయడం చూస్తూనే ఉన్నాం. ప్రభుదేవ, లారెన్స్ ఇలా పలువురు కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీస్తూ హిట్లు కూడా కొడుతున్నారు. ఈనేపథ్యంలోనే లేడీ కొరియోగ్రాఫర్ బృందా కూడా డైరెక్టర్ గా మారి దర్శకత్వం చేస్తున్నారు. గత ఏడాది హే సినామిక అనే సినిమాతో వచ్చారు బృందా. ఇక ఇప్పుడు థగ్స్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈసినిమా ఫల్ రా అండ్ రస్టిక్ గా తీశారు బృంద.
ఇక ఈసినిమా విషయానికొస్తే.. కొన్ని కొన్ని సినిమాలు ఒక్క పాయింట్ చుట్టే కథ తిరుగుతుంది. అయితే దానిని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే ప్రేక్షకులు సైతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఇక అలాంటి కోవలోకే వస్తుంది కోనసీమ థగ్స్. ఈసినిమా కథ ఎక్కువ శాతం జైలులోనే ఉంటుంది. హీరో జైలు నుండి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు.. దానికోసం ఎంత దూరమైనా వెళ్లడం.. కథను తీర్చిదిద్దిన తీరు ఆసక్తికరంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆసక్తకిరంగా మలచడంలో బృందా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
పెర్ఫామెన్స్
నటీనటుల విషయానికి వస్తే హృదు హరూన్ ఈ సినిమాతో తమిళం ఇంకా తెలుగులో కూడా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమా కాబట్టి తన పాత్రకు తగినట్టుగా బాగానే చేసుకుంటూ వెళ్లాడు. బాబి సింహా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి మాస్ క్యారెక్టర్‌లో తన నటన ఎంత సహజంగా ఉంటుందో తెలిసిందే. ఈసినిమాలో కూడా అంతే సహజంగా నటించాడు. అనశ్వర రాజన్ తన పరిమిత పాత్రలో డీసెంట్‌గా నటించింది. మునీష్‌కాంత్, ఆర్‌కే సురేష్‌తో పాటు ఇతర నటీనటులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ వాల్యూస్
సాంకేతిక విభాగానికి వస్తే సామ్ సిఎస్ అందించిన సంగీతం బాగానే ఉంది. పాటల సంగతి పక్కన పెడితే.. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ సినిమాలో మరో హైలైట్. తన విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
ఓవరాల్ గా చెప్పాలంటే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ కు ఈసినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.