మైఖేల్ మూవీ రివ్యూ

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మైఖేల్‌ వంటి పాన్‌ ఇండియా సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచలాను పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ చేసిన ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజ‌య్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు
దర్శకత్వం.. రంజిత్ జయకోడి
బ్యానర్స్.. కరణ్ సీ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్
నిర్మాతలు.. భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు
సమర్పణ.. నారాయణ్ దాస్ కె. నారంగ్
సంగీతం.. సామ్ సిఎస్
సినిమాటోగ్రఫి.. కిరణ్ కౌశిక్

కథ..
మైఖేల్ (సందీప్ కిషన్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథ గానే పెరుగుతాడు. ఇక మరోవైపు గురునాథ్ ( గౌతమ్ మీనన్) పెద్ద డాన్. అయితే ఒకసారి గురనాథ్ పై జరిగే అటాక్ లో మైఖేల్ అతనిని కాపాడతాడు. అలా మరోసారి జరిగే అటాక్ లో కూడా గురనాథ్ ను మైఖేల్ కాపాడతాడు. దీంతో మైఖేల్ ను తన దగ్గర పెట్టుకుంటాడు గురనాథ్. ఆ తరువాత తను చేసే ప్రతి పనిలో కూడా మైఖేల్ పాత్ర ఉండేలా చూసుకునే వాడు. ఆ క్రమంలో తనపై అటాక్ చేయడానికి వచ్చిన వారు ఎవరో తెలుసుకుంటాడు గురునాథ్. వారిలో ఒకరిని చంపే బాధ్యతను మైఖేల్ కు అప్పగిస్తాడు. ఆ పని మీద ఢిల్లీ వెళ్లిన సందీప్ అక్కడ తిరు (దివ్యాంశ కౌషిక్) ప్రేమలో పడతాడు. ఇక అక్కడే ఢిల్లీలో సందీప్ కిషన్ పై గురనాథ్ కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్) అటాక్ చేస్తాడు. మరి గురనాథ్ ఎంతో నమ్మిన మైఖేల్ పై కొడుకు అమర్ నాథ్ ఎందుకు అటాక్ చేస్తాడు.. తిరు ఎవరు? ఢిల్లీ వెళ్లిన సందీప్ కిషన్ ప్రత్యర్థిని చంపాడా?లేదా? అన్నది మిగిలిన కథ..

విశ్లేషణ
డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పటివరకూ చాలానే వచ్చాయి. అయితే ఏ కథ అయినా కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తే ప్రేక్షకుడు ఖచ్చితంగా చూస్తాడు. సినిమాలోని కథాంశం చూస్తుంటే పలు సినిమాలు గుర్తుకు వచ్చినా డైరెక్టర్ రంజిత్ మాత్రం తన శైలిలో కాస్త కొత్తగా చూపించే ప్రయత్నించాడు. రొటీన్ సన్నివేశాలను కూడా మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా సినిమాని బాగానే తెరకెక్కించాడు. రివేంజ్ ఫార్ములా క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. సినిమాలో హీరో క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు, దానికి అనుగుణంగా రాసిన డైలాగ్స్‌.. స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన విధానం అన్నీ బాగానే ఆకట్టుకుంటాయి.

పెర్ఫామెన్స్
ఈసినిమా రిలీజ్ కు ముందే అర్థమైపోయింది.. సందీప్ కిషన్ ఈసినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని. ఇక ఇప్పుడు అదే నిజమైంది. ఈసినిమా కోసం తను పడ్డ కష్టం కనిపిస్తుంది. సిక్స్ ప్యాక్ లుక్ తో అదరగొట్టిన సందీప్ కిషన్ నటన పరంగా కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు. ఈసినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించాడు సందీప్ కిషన్. తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఇక విల‌న్‌గా చేసిన గౌత‌మ్ మీన‌న్‌ డాన్ పాత్ర‌లో మెప్పించాడు. వ‌రుణ్ సందేశ్ కు ఈసినిమాలో డిఫరెంట్ పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఇది వ‌ర‌కూ చేసిన పాత్ర‌లకు విభిన్నంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. ఇక దివ్యాంశ కౌశిక్‌ మ‌జిలీ త‌ర్వాత మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. తన నటన కూడా బాగానే ఉంది. అన‌సూయ పాత్ర నిడిపి తక్కువగా ఉన్నప్పటికీ పాత్ర ప‌రిధి మేర‌కు బాగానే న‌టించింది. విజయ్ సేతుపతి తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ నటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఈసినిమాకు సినిమాటోగ్రాఫి ప్రధాన బలంగా నిలిచిందని చెప్పొచ్చు. కిరణ్ కౌశిక్ అందించిన విజువల్స్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. చాలా వరకు స్టైలిష్ లుక్స్ తో సినిమా సెట్ అప్ ని సినిమాటోగ్రాఫర్ బాగా చూపించారు. నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చూసే వారికి బాగా నచ్చుతుంది. మిగిలి వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.