వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ

2023 Latest Telugu Reviews, Bobby Kolli, Catherine Tresa, DSP, Latest telugu movie reviews, Latest Telugu Movies 2023, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, Megastar Chiranjeevi, New Movie Reviews, New Telugu Movie Reviews 2023, New Telugu Movies 2023, Ravi Teja, Shruti Haasan, Telugu cinema reviews, Telugu Filmnagar, Telugu Movie Ratings, telugu movie reviews, Telugu Movie Reviews 2023, Telugu Movies 2023, Telugu Reviews, Telugu Reviews 2023, Tollywood Reviews, Waltair Veerayya, Waltair Veerayya (2023 film), Waltair Veerayya (2023) – Movie, Waltair Veerayya (film), Waltair Veerayya (Telugu) (2023) – Movie, Waltair Veerayya 2023, Waltair Veerayya Critics Review, Waltair Veerayya First Review, Waltair Veerayya Movie, Waltair Veerayya Movie – Telugu, Waltair Veerayya Movie (2023), Waltair Veerayya Movie Highlights, Waltair Veerayya Movie Plus Points, Waltair Veerayya Movie Public Response, Waltair Veerayya Movie Public Talk, Waltair Veerayya Movie Review, Waltair Veerayya Movie Review And Rating, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Review, Waltair Veerayya Review – Telugu, Waltair Veerayya Story review, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Live Updates, Waltair Veerayya Telugu Movie Review, Waltair Veerayya Telugu Review

బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈసినిమాను ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు బాబీ. ఈసినిమాలో పాత చిరును చూస్తున్నట్టు ఉందన్న అభిప్రాయాలు ఇప్పటికే ఏర్పడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా వింటేజ్ చిరును చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. చిరంజీవి, శృతిహాసన్, రవితేజ, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు
దర్శకత్వం.. బాబీ
బ్యానర్స్.. మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు.. నవీన్ యెర్నేనీ, వై.రవిశంకర్
సంగీతం..దేవీ శ్రీ ప్రసాద్

కథ..

వీరయ్య (చిరంజీవి) వాల్తేరులోని జాలరిపేటలో నివసిస్తుంటాడు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వీరయ్య తన తండ్రి తోనే (సత్యరాజ్) ఉంటాడు. ఇక వీరయ్య కు సముద్రంలోని అణువణువు తెలిసినవాడు కావడంతో నేవీ అధికారులు సైతం తన సహాయం తీసుకుంటూ ఉంటారు. మరోవైపు పేరు మోసిన డ్ర‌గ్ డీల‌ర్ సాల్మ‌న్ సీజ‌ర్ (బాబీ సింహ‌). అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళుతున్న క్రమంలో తప్పించుకుంటాడు. దాంతో ఆ స్టేష‌న్ సీఐ సీతాప‌తి(రాజేంద్ర ప్ర‌సాద్‌)ని స‌స్పెండ్ చేస్తారు. సీతాప‌తి ఎలాగైనా సాల్మ‌న్‌ను అరెస్ట్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంటాడు. ఈనేపథ్యంలో దానికి సరైనవాడు వీరయ్య అని తెలుసుకొని తనని తన డీల్ ప్రకారం ఒప్పిస్తాడు. ఇక దానికోసం తన గ్యాంగ్ తో మలేసియా వెళతాడు. సాల్మన్ సీజర్ ను పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదనీ, అతని వెనుక అతని అన్నయ్య మైఖేల్ సీజర్ (ప్రకాశ్ రాజ్) ఉన్నాడని తెలుసుకుంటాడు. అయితే అతను కేవలం తమ పనిమీదనే అక్కడికి రాలేదనే విషయం సీతాపతికి అర్థమవుతుంది. మరి అస‌లు మైకేల్‌కి వీర‌య్య‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? ఏసీసీ విక్ర‌మ్ సాగ‌ర్‌ (రవితేజ)కి వీర‌య్య‌కి ఉన్నసంబంధం ఏంటి? వీరయ్య విక్ర‌మ్ సాగ‌ర్ కు ఏమవుతాడు? మైకేల్‌ను వీర‌య్య ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..

ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చిరు నుండి మళ్లీ ఒక మాస్ ఎంటర్ టైనర్ లను కోరుకుంటున్నారు. సైరా కానీ, ఆచార్య, గాడ్ ఫాదర్ లో కానీ కాస్త సెటిల్డ్ గా ఉండే పాత్రలు చేశాడు. దీంతో అభిమానులు కూడా ఓ మాస్ రోల్ లో చేయాలని అలానే వింటేజ్ చిరంజీవిని మరోసారి చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలోనో బాబీ వాల్తేరు వీరయ్య సినిమాతో అభిమానుల కోరిక తీర్చేశాడు. ఈసినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుండి, ట్రైలర్ వరకూ అన్నీ అభిమానులను అలరించాయి. ఇక అభిమానులను ఎక్కడా కూడా నిరాశపరచకుండా చిరంజీవి నుండి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే అభిమానులు కోరుకుంటారో అలాంటి అంశాలు అన్నీ ఈసినిమాలో బాబీ సమకూర్చాడు. ఆడియన్స్ కి మళ్లీ వింటేజ్ చిరుని చూపించాడు. చిరు నటన, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ ఇలా అన్నీ ఉన్న మాస్ కమర్షియల్ సినిమాను రూపొందించాడు. దాదాపు అభిమానుల అంచనాలను రీచ్ అయ్యాడు. మలేషియా వెళ్లాక..చిరు – వెన్నెల కిశోర్ మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ లో రవితేజ ఎంట్రీతో.. మెగా-మాస్ అభిమానులకి గూస్ బంప్స్ వస్తాయి. విక్రమ్ – వీరయ్యల మధ్య వైర్యం పై తీసిన సీన్స్ ఆసక్తిగా ఉంటాయి.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్ విషయానికి వస్తే మెగాస్టార్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇలాంటి మాస్ పాత్రలు ఎన్నో చేశారు. ఈసినిమా కోడు రఫ్ అండ్ మాస్ పాత్ర లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. ఇక ఏసీపీ విక్రమ్ పాత్ర కు రవితేజ పర్ఫెక్ట్ ఛాయిస్ అనేలా నటించాడు. గతంలో చిరుతో నటించిన అనుభవం ఉంది కాబట్టి అదే ఈజ్ తో నటించేశాడు. హీరోయిన్ శృతీ హాసన్ కూడా బాగానే నటిచింది. ముఖ్యంగా చిరు, శ్రుతి హాసన్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌ గా చాలా బాగుంది. బాబీ సింహా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్..

ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాటలు ఏ రేంజ్ లో యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయ. సినిమాపై మంచి బజ్ ఏర్పడానికి దేవి శ్రీ పాటలు కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలు బాగున్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఇంకా సినిమాటోగ్రఫి కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సముద్రంలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అలానే పాటలను మంచి విజువల్స్ అందించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమాలో వింటేజ్ చిరును మరోసారి చూడొచ్చు. మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబీ. ఇక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లను ఇష్టపడే వాళ్లకి ఈసినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. మిగిలిన వర్గల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =