గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గరనుండి పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. బాలకృష్ణ,శృతీ హాసన్, దునియా విజయ్, మంజువారియర్, హనీ రోజ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర, అన్నపూర్ణమ్మ, బ్రహ్మానందం, అలీ, అజయ్ ఘోష్ తదితరులు..
దర్శకత్వం.. గోపీచంద్ మలినేని
బ్యానర్స్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్
నిర్మాతలు.. నవీన్ యెర్నేని, వై రవి శంకర్
సంగీతం.. థమన్
సినిమాటోగ్రఫి.. రిషి పంజాబీ
కథ…
జై సింహా రెడ్డి (బాలకృష్ణ) తన తల్లి మీనాక్షి (హనీ రోజ్) తో కలిసి ఇస్తాంబుల్ లో జీవిస్తుంటాడు. ఇక అక్కడే ఉంటున్న ఈషా (శృతీ హాసన్) ను కొన్ని పరిస్థితుల్లో కలుసుకుంటాడు జై సింహా రెడ్డి. ఇక ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇక వీరి ప్రేమను ఒప్పుకున్న ఈషా తండ్రి పెళ్లి గురించి మాట్లాడేందుకు జై సింహారెడ్డి తల్లి దండ్రులను ఇంటికి రమ్మని చెపుతాడు. ఇక అప్పటివరకూ తన తండ్రి గురించి చెప్పని మీనాక్షి తన తండ్రి వీరసింహారెడ్డి గురించి చెబుతుంది. అనంతరం జై సింహారెడ్డి పెళ్లి గురించి మాట్లాడటానికి వీరసింహారెడ్డిని ఇస్తాంబుల్ కు రమ్మని చెప్పడంతో అక్కడకు వెళతాడు. మరోవైపు వీరసింహారెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తుంటారు భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) అండ్ కో బ్యాచ్. ఆ భానుమతి ఎవరో స్వయంగా వీరసింహారెడ్డి చెల్లి. ఆ పగతోనే వారు కూడా ఇస్తాంబుల్ వెళతారు. మరి అన్నని చంపేంత కోపం ఎందుకు? వారిద్దరి మధ్య ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? మరి వీరసింహారెడ్డిని చంపారా? జై సింహారెడ్డి ఏం చేశాడు అన్నది ఈసినిమా మిగిలిన కథ..
విశ్లేషణ
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంలో బాలకృష్ణ దిట్ట. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు ఫ్యాక్షన్ డ్రాప్ లో చేశారు. అంతేకాదు ఎన్నో సూపర్ హిట్లను సైతం అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యాక్షన్ డ్రాప్ లో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి. ఇక మాస్ సినిమాలు తీయడంలో గోపీచంద్ కూడా ఎక్పర్ట్ కాబట్టి అందులోనూ బాలకృష్ణ హీరో అవ్వడంతో.. బాలయ్యకు ఎలాంటి పాత్ర అయితే సూట్ అవుతుందో పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని.. దాని చుట్టే సన్నివేశాలు అల్లుకున్నాడు. రొటీన్ ఫ్యాక్షన్ స్టోరీయే కానీ దానికి కొత్తగా చెల్లి సెంటిమెంట్ ను యాడ్ చేశారు గోపీచంద్. బాలకృష్ణ సినిమాలో ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈసినిమాలో ఉండేలా చూసుకున్నాడు గోపీచంద్. సినిమా మొత్తం బాలయ్య యాక్షన్, డైలాగ్స్, ఫ్యాక్షన్, ఎమోషన్ నిండిపోయింది.
ఇక నటీనటుల విషయానికొస్తే ఇలాంటి పాత్రలు బాలయ్యకు కొట్టిన పిండి. ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా బాలకృష్ణ తన ఉగ్రరూపం చూపించాడు. తన పవర్ఫుల్ డైలాగ్స్ తో అభిమానులను మెప్పించాడు. ఈసినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కు ప్రధాన పాత్ర దక్కింది. బాలయ్య తర్వాత ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు వరలక్ష్మి శరత్ కుమార్.. బాలయ్యకు చెల్లెలుగా, మేనత్త పాత్రలో ఆమె నటన సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. ఇక హీరోయిన్ గా నటించిన శృతీహాసన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. విలన్‌గా నటించిన దునియా విజయ్ తన పాత్రకు న్యాయం చేశాడు. క్రూరత్వం కనిపించేలా నటించాడు. ఫ్రెష్‌గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత దునియా విజయ్‌కు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇక హనీ రోజ్ బాలయ్య తల్లిగా, భార్య పాత్రలో ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఈసినిమాకు సంగీతం కూడా ప్రధాన బలం అని ఇప్పటికే పాటలను చూస్తే అర్థమైపోయింది. అఖండ సినిమాకు ఎలాగైతే తన సంగీతంతో ప్రాణం పోశాడో ఇక ఈ సినిమాకు కూడా పూర్తి స్దాయిలో తన సంగీతంతో ప్రాణం పోశాడు థమన్. ప్రతి సీన్ కు తనదైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. ఇక యాక్షన్ సీన్స్ కి తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. మంచి విజువల్స్ ను అందించారు. రామ్-లక్ష్మణ్ అందించిన యాక్షన్ సీక్వెన్స్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా అభిమానులు ఫుల్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ లు ఇష్టపడే వాళ్లకి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: