శ్రీపతి కర్రి దర్శకత్వంలో ఆనంద్ రవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కొరమీను. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈమధ్య రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు
దర్శకత్వం.. శ్రీపతి కర్రి
సమర్పణ.. మ్యాంగో మాస్ మీడియా
బ్యానర్స్.. ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు..పెళ్లకూరు సామాన్య రెడ్డి
సంగీతం..సిద్ధార్థ్ సదాశివుని
సినిమాటోగ్రఫి..కార్తీక్ కొప్పెర
కథ..
డీజీపీ మీసాల రాజు (శత్రు) అంటే రౌడీలకు హడల్. ఎన్నో ఎన్ కౌంటర్లు చేసిన మీసాల రాజు ట్రాన్స్‌ఫర్ తో విశాఖకు బదిలీ అవుతారు. అలాంటి వ్యక్తి వైజాగ్ సిటీకి రాగానే అతనిపై కొందరు దాడి చేసి మీసాలను తీసేస్తారు. దాంతో అతను కోపంతో రగిలిపోతుంటాడు. ఇక తన మీసాలు తీసింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈనేపథ్యంలో జాలరి పేట డాన్ వీరభద్రం కొడుకు కరుణ (హరీష్ ఉత్తమన్) గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. మరోవైపు మీను అలియాస్ మీనాక్షి (కిశోరీ ధాత్రక్) కరుణ డ్రైవర్‌గా పనిచేసే కోటి (ఆనంద్ రవి) ప్రేమలో ఉంటారు. ఈవిషయంలో కోటితో కరుణ గొడవ పడతాడు. ఇక మీసాల రాజు విశాఖకు రావడానికి ముందు రోజు నుంచి మీను, కోటి, కరుణ కనిపించకుండా పోతారు. వాళ్ళ ముగ్గురూ ఏమయ్యారు? మీసాల రాజు మీసాలు తీసేసినది ఎవరు? ఇంతకీ కరుణ ఏం చేశాడు? జాలరి పేటలోని కోటి, మీనాక్షితో కరుణకు ఉన్న గొడవేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
ఆనంద్ రవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నెపోలియన్ సినిమా చూసిన వారికి ఆనంద్ రవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నటుడిగానే రచయితగా కూడా అనుభవం ఉంది ఆనంద్ రవికి. ప్రతినిధి అనే సినిమాకు రచయితగా పనిచేశారు. ఇక నెపోలియన్ సినిమాకు హీరోగా మాత్రమే కాకుండా రచయితగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా కథను అందిస్తూ నటుడిగా కొరమీను సినిమాతో వస్తున్నాడు.
నిజానికి కొన్ని సినిమాలు చాలా న్యాచురల్ గా ఉంటాయి. వాటిని తెరకెక్కించే తీరు తీరు.. అందులో పాత్రలు నటించే విధానమే అందుకు కారణం. ఇక ఇప్పుడు అలాంటి సినిమానే కొరమీను కూడా. ఇక రచయితగా అనుభవం ఉంది కాబట్టి ఇక ఈసినిమాకు మంచి కథను అందించాడు ఆనంద్ రవి. ప్రతి కథలో ఓ హీరో, విలన్, హీరో ప్రేమలో పడటం, విలన్ హీరోయిన్ ను ప్రేమించడం కామన్ గా జరుగుతుంటుంది. ఇక ఈసినిమాలో కూడా అలాంటిదే ఉంటుంది.. కానీ దాన్నే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక కేవలం ప్రేమకథనే నమ్ముకోలేదు రవి. మత్స్యకారుల జీవనవిధానం.. అదే సమయంలో అమాయకులను అంగబలం, ఆర్థికబలంతో భయపెడుతూ శాషించే పెద్దోళ్ల అఘాయిత్యాలను కూడా చూపించాడు. ఇక రవి రాసుకున్న కథను అంతే బాగా స్క్రీన్ పై ప్రెజంట్ చేయగలిగాడు దర్శకుడు శ్రీపతి. ఈసినిమా అంత న్యాచురల్ గా వచ్చిందంటే ఆ క్రెడిట్ శ్రీపతికి ఇవ్వాల్సిందే.
పెర్ఫామెన్స్
ఇక పెర్ఫామెన్స్ విషయానికి వస్తే.. ఆనంద్ రవి కోటి అనే జాలరి పేట యువకుడిగా, విలన్ అనుచరుడిగా.. చివరకు అతనికి ఎదురు తిరిగే వ్యక్తిగా చక్కగా నటించారు. హీరోయిన్ కిశోరి ధాత్రిక్ పాత్ర పరిధి మేరకు నటించింది. రాజా రవీంద్ర పాత్ర చిన్నదే అయినా చాలా రోజుల తర్వాత చాలా మంచి రోల్‌లో నటించారు. జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ కూడా మంచి పాత్రలో కనిపించి అలరించారు. శత్రు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా.. డాన్ పాత్రలో హరీష్ ఉత్తమన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ వాల్యూస్
ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫి కూడా ప్రధాన బలాలుగా నిలిచాయి. సన్నివేశాలకు తగ్గట్టుగా సిద్దార్థ్ శివుని ఇచ్చిన సంగీతం చాలా బాగా కుదిరింది. ఇక ఈసినిమా స్క్రీన్ పై అంత న్యాచులర్ గా కనిపించడానికి సినిమాటోగ్రఫి అని చెప్పకుండా ఉండలేం. కార్తీక్ అంతబాగా సినిమాటోగ్రఫి అందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి
ఓవరాల్ గా చెప్పాలంటే ఒక సహజమైన కథను చూడాలంటే కొరమీను సినిమాను చూసి ఎంజాయ్ చెయొచ్చు. ఈసినిమా అన్ని వర్గాల వారు చూసే సినిమా అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: