కనెక్ట్ మూవీ రివ్యూ

2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, anupam kher, Ashwin Saravanan, Connect, Connect (2022 film), Connect (2022) – Movie, Connect (film), Connect (Telugu) (2022) – Movie, Connect 2022, Connect Critics Review, Connect First Review, Connect Movie, Connect Movie – Telugu, Connect Movie (2022), Connect Movie Highlights, Connect Movie Plus Points, Connect Movie Public Response, Connect Movie Public Talk, Connect Movie Review, Connect Movie Review And Rating, Connect Movie Updates, Connect Review, Connect Review – Telugu, Connect Story review, Connect Telugu Movie, Connect Telugu Movie Latest News, Connect Telugu Movie Live Updates, Connect Telugu Movie Review, Connect Telugu Review, Haniya Nafisa, Latest 2022 Telugu Movie, latest movie review, Latest telugu movie reviews, Latest Telugu Movie Reviews 2022, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, latest tollywood updates, Nayanthara, New Movie Reviews, New Telugu Movie Reviews 2022, New Telugu Movies 2022, Prithvi Chandrasekhar, SathyaRaj, Telugu cinema reviews, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Movie Ratings, telugu movie reviews, Telugu Movie Reviews 2022, Telugu Movies 2022, Telugu Reviews, Telugu Reviews 2022, Tollywood Movie Updates, Tollywood Reviews, Vignesh Shivan, Vinay Rai

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఎన్నోఅంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. నయనతార, అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస తదితరులు
దర్శకత్వం.. అశ్విన్ శరవణన్
బ్యానర్.. రౌడీ పిక్చర్స్
నిర్మాత.. విఘ్నేష్ శివన్
తెలుగు సమర్పణ.. యూవీ క్రియేషన్స్
సంగీతం .. పృథ్వి చంద్రశేఖర్‌
సినిమాటోగ్రఫి.. మణికంఠన్ కృష్ణమాచారి

కథ..

సుసాన్ (నయనతార) తన భర్త జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్), కుమార్తె అమ్ము అలియాస్ అనా జోసెఫ్ (హనియా నఫీసా), అలాగే తండ్రి ఆర్థర్ (సత్యరాజ్)తో సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఇక జోసెఫ్ బెనాయ్ డాక్టర్.. ఈనేపథ్యంలో కోవిడ్ రోగులకు వైద్యం అందించే క్రమంలో అదే రోగం బారినపడి మరణిస్తాడు. ఇక జోసెఫ్ మరణంతో వారి కుటుంబం డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా తండ్రిని ఎంతగానో ప్రేమించే అనా తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈక్రమంలో ఒకరోజు తన తండ్రితో మాట్లాడాలని అనా వుయ్ జా బోర్డుతో ట్రై చేస్తుంది. ఇక అప్పటినుండి అనా ప్రవర్తనలో మార్పు వస్తుంది. దానికి కారణం తను ఓ ఆత్మకు బంధీ అయిందని తెలుసుకుంటారు. మరి ఆ దెయ్యం నుంచి తన కూతుర్ని కాపాడుకోవడానికి సుసాన్ ఏం చేసింది ?, ఈ క్రమంలో ఆమె తండ్రి ఆర్థర్ (సత్యరాజ్), అలాగే ఫాదర్ అగస్టీన్ (అనుపమ్ ఖేర్) ఆమెకు ఎలాంటి సాయం చేశారు?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ..

లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. అంతేకాదు తెలుగులో కూడా నయన్ సినిమాలు చేయడం తగ్గించేసింది. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెల్లెలి పాత్ర ద్వార తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కనెక్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా రెండో సినిమా ఇది.

ఎన్ని సినిమాలు వచ్చినా.. ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటే.. హార్రర్ సినిమాల్లో ఉండాల్సింది థ్రిల్లింగ్ అంశాలు.. ట్విస్ట్ లు.. ప్రేక్షకుడిని సీటు ఎడ్జ్ మీద కూర్చుండేలా చేయడం.. మేకింగ్ ఇలా అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా సెట్ అయితేనే సినిమా హిట్ అవుతుంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ కి ఈ తరహా కథలపై మంచి పట్టుంది. గతంలో హార్రర్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ సినిమాను కూడా చాలా బాగా నడిపించాడు.

ఈసినిమాలో పాత్రలు పెద్దగా వచ్చేది ఉండదు.. హోమ్ క్వారంటైన్.. దెయ్యం ఆవహించిన కూతురు .. కూతురును మామూలు మనిషిని చేయడానికి తపించే తల్లి .. ఆమెకి హెల్ప్ చేసే పాత్రల్లో తండ్రి .. చర్చి ఫాదర్ కేవలం అతి తక్కువ పాత్రలతోనే సినిమా లాగించేశాడు. తల్లీ కూతుళ్లు హోమ్ క్వారంటైన్ లో ఉన్న 14 రోజుల్లో ఏ రోజున ఏం జరుగుతుందనేది సినిమా మొత్తం చూపించాడు డైరెక్టర్.

నయనతార నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. తల్లిగా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా తన కూతుర్ని దెయ్యం ఇబ్బంది పెడుతున్న క్రమంలో వచ్చే సీన్స్ లో నయనతార నటన చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే సత్యరాజ్ కూడా మెప్పించారు. ఎమోషనల్ సీన్స్ లోనూ సత్యరాజ్ పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ఇక నయనతార, కూతురికి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ఎలివెట్ అయ్యాయి. సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన అనుపమ్‌ ఖేర్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన వినయ్‌ రాయ్‌ కూడా చాలా బాగా నటించారు. అదే విధంగా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నికల్ వాల్యూస్

ఇలాంటి హార్రర్ సినిమాలకు టెక్నికల్ వాల్యూస్ చాలా ముఖ్యం. ఇక ఈసినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫి బాగా సెట్ అయ్యాయి. హారర్ సన్నివేశాలకు పర్ఫెక్ట్ టెంపో, ఇంటెన్సిటీ క్రియేట్ చేయడంలో అవి ఉపయోగపడ్డాయి. కనెక్ట్ మూవీకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రధానబలంగా నిలిచాయి. పృథ్వీ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భయపెట్టాడు.

ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here