కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ ఏమీ ఉండదు

Dil Raju About Masooda Movie Success, Masooda Movie Success, Dil Raju About Masooda, Masooda Success, Sangeetha, Subhalekha Sudhakar, Kavya Kalyan Ram, Thiruveer, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Thiruveer Movies, Masooda, Masooda 2022, Masooda Movie, Masooda Telugu Movie, Masooda Update, Masooda News, Masooda Latest News, Masooda New Update, Masooda Movie Live Updates, Masooda Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, లగడపాటి శ్రీధర్, హీరో సుమంత్, సుహాస్ డైరెక్టర్ సందీప్ రాజ్,శుభలేఖ సుధాకర్, జూబ్లీ హిల్స్ కంటే స్ట్ ఎమ్ ఏల్ ఏ నవీన్ యాదవ్, డైరెక్టర్ భరత్ కమ్మ, డైరెక్టర్ వినోద్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాహుల్ యాదవ్ టేస్ట్ కు తగ్గట్టు కథను, దర్శకుడు గౌతమ్ ను సెలెక్ట్ చేసుకొని “మళ్ళీ రావా” సినిమా చేసి హిట్ కొట్టాడు, ఆ తరువాత “ఏజెంట్ ఆత్రేయ” సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టి, ఇప్పుడు దర్శకుడు సాయి కిరణ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం అనేది గ్రేట్ .ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పం తో సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తాయి అని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడు.తన హోమ్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించిన రాహుల్ కు & టీం కు కంగ్రాట్స్. ఇక నుండి రాహుల్ ఈ సక్సెస్ ను కాపాడుకోవడం కూడా బిగ్ టాస్క్.నవంబర్ 18 న “మసూద” ఆ తరువాత “లవ్ టుడే”, “హిట్ 2” ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడం చూస్తుంటే ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. మంచి సినిమాలకు సీజన్ అంటూ ఉండదు. ఇలాంటి మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని “మసూద” మళ్ళీ ప్రూవ్ చేసింది. రాహుల్ తన బ్యానర్ లో ఇలాంటి మంచి సినిమాలు చాలా తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్ర యూనిట్ అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ.. రాహుల్ తో గత ఆరు సంవత్సరాలనుండి జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా “మళ్ళీ రావా” చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించిన రాహుల్ కు కంగ్రాట్స్ తెలియ జేస్తున్నాను. ఇంత పెద్ద హిట్ సాధించిన మసూద టీం సభ్యులందరికీ అల్ ద బెస్ట్ అన్నారు

నిర్మాత బేక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ… ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకొని సినిమా తియ్యడమే కాకుండా ఎంతో దైర్యంగా సినిమాను రిలీజ్ చేసి బిగ్ హిట్ సాధించాడు. ఇందులో తిరువీర్ ,సంగీత, అఖిల ఇలా ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు.ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ కు గురి చేస్తుంది. ఇంకా చూడని వారుంటే చూసి ఈ సినిమాను ఇంకా బిగ్ సక్సెస్ చెయ్యాలి అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. నాకు హరర్ సినిమాలు అంటే భయం. కానీ ఈ సినిమాను రాహుల్ తో కలసి మెదటి రోజు చూశాను చాలా బాగా నచ్చింది. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ చూసి ఈ జోనర్ కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అనిపించింది.అప్పుడే నాకు ఇలాంటి సినిమా తియ్యాలి అనిపించింది. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ..ఇలాంటి సినిమాలు తియ్యాలి అంతే గట్స్ ఉండాలి. అలాంటిది రాహుల్ యాదవ్ చక్కటి కథలను , టీం ను సెలెక్ట్ చేసుకొని వరుసగా హిట్స్ కొడుతున్న రాహుల్ కు మరియు చిత్ర యూనిట్ కు అందరికీ కంగ్రాట్స్ అన్నారు.

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ..ఈ సినిమా విడుదలైన మూడవ వారంలో కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. నేను ఇంజనీరింగ్ చేసిన తరువాత సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యి ఒరిస్సాలో ఒక ప్రాజెక్టు చేసి, మళ్ళీ ఇక్కడకు వచ్చి ,చివరకు ఫిల్మ్ ఇండస్ట్రీ కి రావడం జరిగింది. నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా నాన్నే. తన దగ్గర నుండే హార్డ్ వర్క్ ఎలా చెయ్యాలో నేర్చుకొన్నాను.తనే నన్ను ముందుండి నడిపించాడు.ఇలా నా ఫ్యామిలీ అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయడం వలెనే మూడు సినిమాలు బిగ్ హిట్స్ అయ్యాయి. వారి సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేవాన్ని కాను.ఈ సినిమా విషయానికి వస్తే నేను అందరి కంటే లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఇంత మంచి స్క్రిప్ట్ రావడం, అలాగే ఫుల్ క్లారిటీ ఉన్న దర్శకుడితో పాటు మంచి టెక్నిషియన్స్ దొరకడం చాలా అదృష్టంగా బావిస్తున్నాను. “మళ్ళీ రావా”, “ఏజెంట్ ఆత్రేయ” సినిమాలు బిగ్ హిట్ అయిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైమ్ లో “మసూద” లాంటి స్క్రిప్ట్ ఇచ్చిన సాయికి బిగ్ థాంక్స్. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తరువాత ఈ కథకు నిర్మాతగా న్యాయం చేయగలుగుతానా లేదా, చివరి వరకు ఈ సినిమాను తీసుకెళ్ల గలిగే ఓపిక ఉందా లేదా అనుకున్నాను.అయితే నాకు సాయి ఫుల్ సపోర్ట్ చేశారు.ఈ సినిమాకు తిరువీర్ కరెక్ట్ యాప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాము. నిజంగా తను చాలా హార్డ్ వర్కర్. ఎన్ని హర్డిల్స్ వచ్చిన తట్టుకొని ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా ఏ సినిమా చేయకుండా మాతో జర్నీ చేస్తున్నాడు. నేను ఇప్పటివరకు మూడు హిట్ సినిమాలు చేశాను అంటే నా ఫ్రెండ్ దయాకర్, వంశీ, వీరు,శ్రీహరి, సత్య ప్రదీప్, లు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకు టెక్నీకల్ పరంగా డి. ఓ. పి నగేష్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు ,మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ బ్రిలియంట్ సాంగ్స్ ఇచ్చాడు.ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ ఇలా ప్రతి ఒక్క టెక్నిషియన్స్ అందరూ ఫుల్ ఎఫర్ట్ పెట్టారు.. అలాగే సంగీత, మసూద గా నటించిన అఖిల, భాందవి, కావ్య, సత్యం రాజేష్ ఇలా అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.అందరికీ తెలుసు నేను పని రాక్షసున్ని అని ఎవరి నైనా ఇబ్బంది పెట్టింటే సారీ చెపుతున్నా..గత మూడు సంవత్సరాలు నా రాక్షసత్వాన్ని భరించినందుకు అందరికి థాంక్స్ చెపుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు సాయి కిరణ్ మాట్లాడుతూ.. ఏ సినిమాకైనా కథ తో పాటు మంచి నటీనటులు , టెక్నిషియన్స్ చాలా అవసరం. అయితే ఈ సినిమాకు నిర్మాత రాహుల్ తనే సెలెక్ట్ చేసుకొని సినిమాటోగ్రఫీ పరంగా, మ్యూజిక్ పరంగా, ఆర్ట్ డైరెక్షన్, ఎడిటర్ ఇలా నాకు అద్భుతమైన టెక్నిషియన్స్ ను ఇచ్చాడు.సీనియర్ నటులు కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ ఏమీ ఉండదుశుభలేఖ సుధాకర్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరువీర్,సంగీత, మసూద అఖిల, భాందవి, కావ్య, సత్యం రాజేష్, కళ్యాణ్ ఇలా అందరూ చాలా బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. స్వదర్మ్మ ఎంటర్టైన్మెంట్ లో నటించిన వారందరికీ మంచి మంచి అవకాశాలు రావడం చాలా హ్యాపీ గా ఉంది. మా “మసూద” సినిమాను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అన్నారు.

సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ..ఈ సినిమాలో దర్శక, నిర్మాతలు నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఇలాంటి సబ్జెక్టు కు కెమెరా వర్క్ ఇంపార్టెంట్. తను అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు.అలాగే మ్యూజిక్ పరంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇంతటి మంచి సినిమాకుమెయిన్ పిల్లర్స్ నలుగురే వారే దర్శక, నిర్మాతలు, తిరువీర్, సంగీత, అఖిల ముఖ్య కారణం. నటీ, నటులు అందరి చేత దర్శకుడు సాయి చక్కటి నటనను రాబాట్టుకున్నాడు. నిర్మాత రాహుల్ ఇలాంటి సినిమాలు మరెన్నో తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో తిరువీర్ మాట్లాడుతూ.. ఇలాంటి రోజు వస్తుందని లైఫ్ లో అనుకోలేదు.నా లైఫ్ లో ఈ నవంబర్ మంత్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా అన్నలైన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

గెస్ట్ గా వచ్చిన సందీప్ రాజ్ మాట్లాడుతూ..ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా లో మాంచి కారెక్టర్ చేశాను. వీరిచ్చిన సపోర్ట్ తో ముఖ చిత్రం చేస్తున్నాను. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారు. అందుకే సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ బ్యానర్ లో ఇంకా గొప్ప గొప్ప సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆన్నారు

గెస్ట్ గా వచ్చిన నటుడు సుహాస్ మాట్లాడుతూ.. ఏజెంట్ ఆత్రేయ సినిమా లో ఛాన్స్ ఇచ్చిన రాహుల్ అన్నకు థాంక్స్. ఈ సినిమాలో నటించిన వారందరూ ఎక్సట్రార్దినరీ గా వర్క్ చేశారు.ఇంకా ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. తిరువీర్ సినిమాలోనే కాకుండా ఒరిజినల్ గా కూడా చాలా మంచోడు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

డి. ఓ. పి నగేష్ మాట్లాడుతూ.. తిరువీర్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశారు. సంగీత, అఖిల, బాందవి ఇలా నటీ, నటులే కాకుండా టెక్నిషియన్స్ ఇలా ప్రతి ఒక్కరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఫారెస్ట్ లో విపరీతమైన చలి ఉన్నా అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా కు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన రాహుల్ కు ధన్యవాదాలు అన్నారు.
గెస్ట్ గా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ వినోద్ మాట్లాడుతూ.. ఇంత టఫ్ టైమ్ లో కూడా ఇంత మంచి హిట్ ఇచ్చిన రాహుల్ గారికి కంగ్రాట్స్,. ఏ సినిమానైనా న్యాచురల్ గా ఉన్నది వున్నట్లు తీస్తే బిగ్ హిట్ అవుతుంది అని ఈ మాసూద సినిమా నిరూపించింది.

నటి సురభి మాట్లాడుతూ.. మాది సురభి నాటకాల కుటుంబం. ఒక చిన్న ఫ్యామిలీ లవ్ స్టోరీ చేశాను.ఒక చిన్న ఆర్టిస్ట్ కు ఒక సినిమాలో ఛాన్స్ దొరకడమే అదృష్టం. అలాంటి ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్ గారికి ధన్యవాదాలు అన్నారు.

మసూద పాత్రలో నటించిన అఖిల మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో టైటిల్ రోల్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎప్పుడూ గుర్తుండి పోతుంది.

నటి బాందవి మాట్లాడుతూ.. తిరువీర్, సంగీత , శుభలేఖ సుధాకర్ వంటి పెద్ద వారితో కలసి చేయడం చాలా సంతోషం గా ఉంది. స్వదర్మ్ ఫ్యామిలీ లో మెంబెర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాగే స్వదర్మ్ లో ఇలా ఎంతోమంది కి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =