ఓరి దేవుడా మూవీ రివ్యూ

Asha, Ashwath Marimuthu, Leon James, Mithila, Ori Devuda, Ori Devuda (2022), Ori Devuda (2022) – Movie, Ori Devuda (film), Ori Devuda Critics Review, Ori Devuda First Review, Ori Devuda Movie, Ori Devuda Movie – Telugu, Ori Devuda Movie (2022), Ori Devuda Movie Highlights, Ori Devuda Movie Plus Points, Ori Devuda Movie Public Response, Ori Devuda Movie Public Talk, Ori Devuda Movie Review, Ori Devuda Movie Review And Rating, Ori Devuda Movie Updates, Ori Devuda Review, Ori Devuda Story review, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Telugu Movie Live Updates, Ori Devuda Telugu Movie Review, Ori Devuda Telugu Review, Pearl V, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Venkatesh, Vishwak Sen

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే అశోకవనంలో అర్జునకళ్యాణం అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అశ్వ‌త్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా ఓరి దేవుడా. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక నేడు ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా విశ్వక్ సేన్ కు మరో హిట్ ను అందించిందా? ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో అన్న విషయం తెలియాలంటే ఈసినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్‌, ఆశా భట్, వెంకటేష్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, నాగినీడు తదితరులు
దర్శకత్వం.. అశ్వత్ మరిముత్తు
బ్యానర్స్.. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు.. పెరల్ వి. పొట్లూరి, పరమ వి. పొట్లూరి, దిల్ రాజు
సినిమాటోగ్రఫి.. విధు
సంగీతం.. లియోన్ జేమ్స్

కథ..

అర్జున్ (విశ్వక్ సేనే) అను (మిథిలా పాల్కర్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. పెద్దయిన తరువాత కూడా వారు మంచి స్నేహితులుగానే ఉంటారు. అయితే అనుకోకుండా అను అర్జున్ తో పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తుంది. అనుకి అర్జున్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అయినప్పటికీ అర్జున్ కి మాత్రం ఇష్టముండదు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆతరువాత పెళ్లయ్యాక అర్జున్ కు స్కూల్ లో తాను ప్రేమించిన ఫస్ట్ క్రష్ (ఆశా భట్) కనపడుతుంది. దీని వల్ల అర్జున్ మరియు అను మధ్య గొడవలు మొదలవుతాయి. దాంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో అర్జున్ కి దేవుడు వెంకటేష్ ప్రత్యక్షమవుతాడు. జీవితాన్ని మార్చుకోవడానికి మరో అవకాశాన్ని కల్పిస్తాడు. మరి ఈసారి అర్జున్ ఎవరిని ప్రేమిస్తాడు? చివరికి అర్జున్ మరియు అను విడిపోతారా? కలుస్తారా..? ఆశా భట్ పరిస్థితి ఏమవుతుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ

ఈమధ్య వచ్చిన రీమేక్ సినిమాలు కూడా తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ చేసిన ఓరి దేవుడా ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని విశ్వక్ సేన్ కు మరో హిట్ ను అందించింది.

ఈసినిమాకు తమిళ్ లో దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తునే దర్శకత్వం వహించడం ప్లస్ పాయింట్. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే మరో ప్లస్ పాయింట్. చాలా సన్నివేశాలు చాలా సింపుల్‌గా మరియు రొటీన్‌గా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే వల్ల గతంలో వచ్చిన ఇతర ప్రేమ చిత్రాలకు బిన్నంగా అనిపిస్తుంది. కోర్టు సీన్స్‌తో మొదలై, వెంకటేష్ దగ్గుబాటిని కలవడం, ఆపై ఫ్లాష్‌బ్యాక్‌కి మారడం, ఇలా స్క్రీన్‌ప్లే తో సినిమా చివరి వరకు చూడటం మరింత ఆసక్తికరంగా మారింది.

పెర్ఫామెన్స్

విశ్వక్ సేన్ కు యాక్టీవ్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఇలాంటి పాత్రలు చేయడంతో ఈపాత్ర ను చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఒకరకంగా విశ్వక్ సేన్ ఈసినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ నటన, తన పాత్ర కామెడీ టైమింగ్ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. మిథిలా పాల్కర్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ తన నటనతో ఆడియన్స్ ను ఫిదా చేసేసింది. విశ్వక్ మరియు మిథిలా ల మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకి బాగా వర్క్ అవుట్ అయింది. ఆషా భట్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. దేవుడి పాత్రలో వెంకటేష్ చాలా బాగా సెట్ అయ్యారు. తెరపై వెంకీ ఉన్నంత సేపు కూడా కామెడీ బాగుంటుంది. రాహుల్ రామకృష్ణ నటన కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. మురళి కృష్ణ, మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్

సాంకేతిక విభాగానికి వస్తే లియోన్ జేమ్స్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి బాగా సెట్ అయ్యింది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగానే ఎలివెట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సినిమాకి మంచి కలర్ ఫుల్ విజువల్స్ ను అందించారు. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఓరి దేవుడా సినిమా మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారు కూడా ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 5 =