క్రేజీ ఫెలో మూవీ రివ్యూ

Aadi Sai Kumar, Crazy Fellow, Crazy Fellow (2022), Crazy Fellow (2022) – Movie, Crazy Fellow (film), Crazy Fellow Critics Review, Crazy Fellow First Review, Crazy Fellow Movie, Crazy Fellow Movie – Telugu, Crazy Fellow Movie (2022), Crazy Fellow Movie Highlights, Crazy Fellow Movie Plus Points, Crazy Fellow Movie Public Response, Crazy Fellow Movie Public Talk, Crazy Fellow Movie Review, Crazy Fellow Movie Review And Rating, Crazy Fellow Movie Updates, Crazy Fellow Review, Crazy Fellow Story review, Crazy Fellow Telugu Movie Latest News, Crazy Fellow Telugu Movie Live Updates, Crazy Fellow Telugu Movie Review, Crazy Fellow Telugu Review, Digangana Suryavanshi, K K Radhamohan, Mirnaa Menon, Phani Krishna Siriki, R R Dhruvan

ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న సినిమా క్రేజీ ఫెలో. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈసినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఆది సాయి కుమార్ కు మంచి హిట్ ను అందించిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. ఆది సాయికుమార్, దిగంగన సూర్యవన్షీ, మర్నా మీనన్, సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్, వినోదిని వైద్యనాథన్, రవి ప్రకాష్ తదితరులు
దర్శకత్వం.. ఫణికృష్ణ
బ్యానర్స్.. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్
నిర్మాతలు.. కె.కె. రాధామోహన్
సంగీతం.. ఆర్ ఆర్ ధృవ
సినిమాటోగ్రఫి.. సతీష్ ముత్యాల

కథ

అభిరామ్ (ఆది సాయికుమార్) లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే అలా తిరుగుతున్న అభిరామ్‌ను తన అన్నయ్య స్నేహితుడు (సప్తగిరి) కంపెనీలో ఉద్యోగంలో చేర్చుతారు. అలా అఫీస్ లో చేరిన అభిరామ్ అదే ఆఫీసులో పని చేసే మధుమిత అలియాస్ చిన్ని (దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడుతుంది. కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. అదే సమయంలో స్నేహితుడు రమేష్ (నర్రా శ్రీనివాస్) బలవంతం మేరకు డేటింగ్ యాప్‌లో చిన్నితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంటాడు అభిరామ్. డేటింగ్ చాలా రోజులు కొనసాగిన తర్వాత ఒకరోజు చిన్ని (దిగంగన)ను కలుసుకొనేందుకు వెళ్లి.. అదే పేరుతో అక్కడికి వచ్చిన చిన్ని (మిర్నా మీనన్)కు ఐ లవ్ యూ చెబుతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు.అయితే ఎంగేజ్ మెంట్ జరుగుతున్న సమయంలో.తను ప్రేమించే చిన్ని ఆమె కాదు అని.. తన ఆఫీసులోనే పనిచేసే మధుమతి అని నిజం తెలుస్తుంది. దీంతో అభి తన తప్పులు ఎలా సరిదిద్దుకుంటాడు.. ఎప్పుడు గొడవ పడే మధుమతి మనసు ఎలా గెలుచుకుంటాడు..ఇంతకు మరో చిన్ని ఎవరు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

ప్రేమ కావాలి సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఆతర్వాత లవ్లీ సినిమాతో మరో హిట్ ను అందుకోవడంతో ఆదికి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదనుకున్నారు అందరూ. అయితే ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ మంచి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఈసినిమాతో వచ్చేశాడు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే ఈ కథతో ఇంతకుముందే ఎన్నో సినిమాలు రావడం చూశాం. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈకథను తెరకెక్కించాడు ఫణికాంత్. అంతేకాదు కామెడీ ఎంటర్ టైనర్ తో పాటు ఎమోషనల్ యాంగిల్ కూడా చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎంట్రీ.. బలాదూర్ గా బాధ్యత లేకుండా ఉండటం.. హీరోయిన్ తో గొడవలు ఇలా సాగిపోతుంది. సెకండ్ హీరోయిన్ మిర్నా మీనన్ ఎంట్రీతో మరో మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌లో రెండు చిన్ని పాత్రల మధ్య అభిరామ్ నలిగిపోయే డ్రామా ఆకట్టుకుంటుంది. దాన్ని కామెడీగానే చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సినిమా లో ఉండే సస్పెన్స్ తో పాటుగా, ట్రయాంగిల్ లవ్ స్టొరీ ను డైరెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది.

పెర్ఫమెన్స్

ఇలాంటి పాత్రల్లో ఆది ఎలా నటిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఇలాంటి లవర్ బాయ్ పాత్రలో చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టి చాలా ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇంకా ఈసినిమాలో ఇంకా స్టైలిష్ గా కనిపించాడు. అభిరామ్ పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మరింత గా ఆకట్టుకున్నాడు. దిగంగన సూర్యవంశీ ఈ చిత్రం లో మంచి పాత్రలో నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో దిగంగన చాలా చక్కని నటన కనబరిచి ఆకట్టుకుంది. మరో హీరోయిన్ మిర్నామీనన్ బబ్లీగా, క్యూట్‌గా అనిపించింది. అలానే నందిని మరియు నర్రా శ్రీను ల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. వీరిద్దరూ కీలక పాత్రల్లో నటించి, చాలా బాగా ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమా ఆర్ఆర్ దృవన్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు సంగతి పక్కన పెడితే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫి బావుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైనర్ ఇష్టపడే వాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాను చూసి ఎండాయ్ చేయోచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here