నేనే వస్తున్నా మూవీ రివ్యూ

Nene Vasthunna Telugu Movie Review, Nene Vasthunna Movie Review, Nene Vasthunna Review, Nene Vasthunna Telugu Review, Nene Vasthunna Movie - Telugu, Nene Vasthunna First Review, Nene Vasthunna Movie Review And Rating, Nene Vasthunna Critics Review, Nene Vasthunna (2022) - Movie, Nene Vasthunna (2022), Nene Vasthunna (film), Nene Vasthunna Movie (2022), Nene Vasthunna Movie: Review, Nene Vasthunna Story review, Nene Vasthunna Movie Highlights, Nene Vasthunna Movie Plus Points, Nene Vasthunna Movie Public Talk, Nene Vasthunna Movie Public Response, Nene Vasthunna, Nene Vasthunna Movie, Nene Vasthunna Movie Updates, Nene Vasthunna Telugu Movie Live Updates, Nene Vasthunna Telugu Movie Latest News, Dhanush, Indhuja, Selvaraghavan, Yuvan Shankar Raja, S.Thanu, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

రీసెంట్ గానే తిరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు ధనుష్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా నేనే వస్తున్నా. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. మరి నేడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. దనుష్, రవిచంద్రన్, ఎల్లి అవరం హీరోయిన్లుగా నటిస్తుండగా.. సెల్వ రాఘవన్, ప్రభు, యోగి బాబు
దర్శకత్వం.. సెల్వరాఘవన్
బ్యానర్స్.. వి క్రియేషన్స్
తెలుగు సమర్పకులు.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌
సంగీతం.. యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫి.. ఓం ప్రకాశ్

కథ

ప్రభు (ధనుష్), ఖదీర్ (రెండో ధనుష్) ఇద్దరు కవల పిల్లలు. అయితే వీరిలో ఖదీర్ చిన్నప్పటి నుండీ కాస్త సైకో లా బిహేవ్ చేస్తుండేవాడు. దీంతో ఖదీర్ నుండి విడిపోతాడు. ఇద్దరు పెద్దయిన తరువాత ప్రభు ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూంటాడు. తన కూతురు సత్య, భార్యతో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ధనుష్ కూతురికి సోను అనే దెయ్యం పడుతుంది. అసలు ఆ సోనూ ఎవరు?, ఎందుకు ధనుష్ కూతుర్నే టార్గెట్ చేసింది?, ఖదీర్ ను చంపాలని ఆ సోనూ ఎందుకు కోరుకుంటాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

ధనుష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ తోనే వస్తారు ప్రేక్షకులు. ఇక ఈసినిమా కూడా అలాంటి అంచనాలను ఏమాత్రం తగ్గించకుండానే ఉంటుంది. సెల్వ రాఘవన్ ఈసినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇలాంటి సినిమాకు కథ ఎంత ఇపార్టెంటో స్క్రీన్ ప్లే కూడా అంతే ఇంపార్టెంట్. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తుండాలి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు ఉండాలి.. సస్పెన్స్ ఇంట్రట్స్ తగ్గినా, సీన్స్ లో ఇంటెన్స్ తగ్గినా కష్టమే. అయితే ఆ విషయంలో సెల్వరాఘవన్ చాలా జాగ్రత్తలే తీసుకున్నాడని చెప్పొచ్చు. క్యారెక్టరైజేషన్స్ తో కథను నడపగలిగే అతి తక్కువమంది ఫిలిమ్ మేకర్స్ లో సెల్వరాఘవన్ ఎక్స్పర్ట్. “నేనే వస్తున్నా”లో కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోయాడు. ఒక హారర్ థ్రిల్లర్ కు సైకో డ్రామాను యాడ్ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఇక ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన ప్రశంసలు కూడా ఏం లేవు. ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంటాడు. రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఖదీర్ పాత్రలో ధనుష్ నటన సూపర్ అని చెప్పొట్టు. నెగిటివ్ షేడ్ లో చాలా బాగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ధనుష్ కూతురికి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ఎలివెట్ అయ్యాయి. భువనగా ఇందూజా రవిచంద్రన్, కదీర్ భార్యగా ఎల్లీ అవ్రామ్ నటించారు. వీరిద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. యోగి బాబు, ప్రభుతో సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇలాంటి సినిమాలకు సంగీతం, సినిమాటోగ్రఫి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈసినిమాకు ఈరెండు విభాగాలు కూడా బలమైన అంశాలుగా మారాయి. ఓం ప్రకాశ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. సినిమా మూడ్‌ను ఎమోషనల్‌గా మార్చింది. ఒక సీరియస్ కంటెంట్‌ను, సైకలాజికల్ థ్రిల్లర్‌ను తెర మీద చెప్పడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఇక యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత బలంగా మార్చింది. నిర్మాత కలైపులి థాను నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here