శాకిని డాకిని తెలుగు మూవీ రివ్యూ

latest telugu movies news, Saakini Daakini, Saakini Daakini Critics Review, Saakini Daakini First Review, Saakini Daakini Movie, Saakini Daakini Movie Highlights, Saakini Daakini Movie Plus Points, Saakini Daakini Movie Public Response, Saakini Daakini Movie Public Talk, Saakini Daakini Movie Review, Saakini Daakini Movie Review And Rating, Saakini Daakini Movie Updates, Saakini Daakini Review, Saakini Daakini Story review, Saakini Daakini Telugu Movie Latest News, Saakini Daakini Telugu Movie Live Updates, Saakini Daakini Telugu Movie Review, Saakini Daakini Telugu Movie Updates, Saakini Daakini Telugu Review, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం “శాకిని డాకిని”. ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా హిట్ అయిందా లేదా? ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే మాత్రం రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రెజీనా, నివేద థామస్, సుధాకర్ రెడ్డి, రఘుబాబు, పృథ్వీ తదితరులు
దర్శకత్వం.. సుధీర్ వర్మ
బ్యానర్స్.. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్
నిర్మాతలు.. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్
సంగీతం.. మిక్కీ మెల్క్రెరీ
సినిమాటోగ్రఫి.. రిచర్డ్ ప్రసాద్

కథ

దామిని(రెజీనా), షాలిని(నివేథ థామస్‌) లు పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అవుతారు. ఇద్దరికీ ఇగో వల్ల మొదట్లో ఎప్పుడూ గొడవలు పడతూ ఉండేవారు. అయితే కొన్ని సంఘటనల తరువాత ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఒకరోజు రాత్రి బయటకు వెళ్లగా.. అదే సమయంలో అమ్మాయిని కొంతమంది కిడ్నాప్ చేయడం​ చూస్తారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా వేరే పెద్ద కేసుతో బిజీగా ఉండటంతో అమ్మాయికి సంబంధించిన కిడ్నాప్ గురించి పట్టించుకోరు. దాంతో ట్రైనీ పోలీసులు అయిన దామిని, షాలిని ఆ కేసు గురించి ఎంక్వౌరీ మొదలు పెడతారు. ఆ సమయంలో ఆ కిడ్నాప్ వెనుక అత్యంత పెద్ద క్రైమ్‌ జరుగుతుందని గుర్తిస్తారు. ఆ క్రైమ్‌ ను ఇద్దరు ఎలా బయటకు తీసుకు వస్తారు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది కథ.

విశ్లేషణ..

ఇక ఈసినిమా ‘మిడ్‌నైట్ రన్నర్స్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా చూసిన వారికి కథ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈసినిమా సీరియస్ యాక్షన్ డ్రామా.. అయితే స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఎంటర్‌టైన్మెంట్‌ వే లో సినిమాను తెరకెక్కించారు. అదే ఈసినిమాకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఆ విషయంలో సుధీర్ వర్మ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ పోలీస్ అకాడమీలో హీరోయిన్లు జాయిన్ అవ్వడం, ఇద్దరి మధ్య గొడవల్, ఫ్రెండ్షిప్, ఎంటర్ టైన్ మెంట్ తో రాసుకోగా.. ఇక సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ మోడ్ లో రాసుకున్నాడు సుధీర్ వర్మ.

నటీనటుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే.. ఈసినిమాకు ప్రధాన బలమే రెజీనా , నివేథ థామస్ లు. తెలంగాణ యాసలో, బబ్లీగా కనిపిస్తూ నివేదా థామస్, కొత్త లుక్ తో రెజీనా ఇద్దరూ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇద్దరికి ఇద్దరు కూడా పోటా పోటీ అన్నట్లుగా నటించి మెప్పించారు. వాళ్ల ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు.. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు ఇద్దరూ పోటీ పట్టారు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఇద్దరూ అదరగొట్టారు. ఇక పోలీస్ ట్రైనింగ్ సీన్స్ లో పృథ్వీ, సుదర్శన్ కామెడీ నవ్విస్తుంది. అలానే ఇన్వెస్టిగేషన్ లో సత్య సీన్స్ కూడా ఫుల్ కామెడీగా ఉంటాయి. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫి బాగుంది. పలు సన్నివేశాల్లో నాచురాలిటీని తీసుకు రావడంలో ఆయన సఫలం అయ్యాడు. ముఖ్యంగా నైట్ షాట్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రీమేక్ సినిమా అయినా కూడా ఇక్కడ తగ్గట్టుగా మార్పులు చేయడంతో ఈసినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈసినిమా అన్ని వర్గాల వారికి ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − sixteen =