ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ-ఎమోషనల్ జర్నీ

Oke Oka Jeevitham Telugu Movie Review,Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Review,Oke Oka Jeevitham Telugu Review,Oke Oka Jeevitham Movie Review In Telugu,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Review - Telugu,Oke Oka Jeevitham Movie Reviews,Oke Oka Jeevitham - Telugu Movie Reviews,Oke Oka Jeevitham Movie Public Talk,Oke Oka Jeevitham Movie Public Response,Oke Oka Jeevitham Movie Updates,Oke Oka Jeevitham Telugu Movie Updates,Oke Oka Jeevitham Telugu Movie Live Updates,Oke Oka Jeevitham Telugu Movie Latest News,Oke Oka Jeevitham Movie Plus Points,Oke Oka Jeevitham Movie Highlights,Oke Oka Jeevitham Movie Story,Oke Oka Jeevitham (2022),Oke Oka Jeevitham (2022) - Movie,Oke Oka Jeevitham Movie First Review,Sharwanand,Ritu Varma,Amala Akkineni,Vennela Kishore,Shree Karthick,S R Prakash Babu,S R Prabhu,Jakes Bejoy,Telugu Cinema Reviews,Telugu Movie Reviews,Telugu Movies 2022,Telugu Reviews,Telugu Reviews 2022,New Telugu Movies 2022,New Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews,Latest Kollywood Reviews,Telugu Filmnagar,Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwanand New Movie Review,Ritu Varma Movies,Amala Akkineni Movies,Sharwanand Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Movie Pre Review,Oke Oka Jeevitham Review And Rating,Oke Oka Jeevitham Movie Pre Review,Oke Oka Jeevitham Public Talk

శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఒకేసారి ఈసినిమాను తెరకెక్కించారు. తమిళ్ లో ‘కణం’ అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఇప్ప‌టికే రిలీజ్ అయిన, పాటలు, టీజర్ ట్రైల‌ర్‌ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఇక భారీ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. శర్వాకు హిట్ ఇచ్చిందా?లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు..శర్వానంద్, రీతూ వ‌ర్మ‌, అమల, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, ఆలీ, మధు నందన్ తదితరలు
దర్శకత్వం.. శ్రీ కార్తిక్
బ్యానర్స్.. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్
నిర్మాతలు.. ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు
సంగీతం.. జెక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫి.. సుజిత్ సారంగ్
ఎడిటర్.. శ్రీజిత్ సారంగ్

కథ..

ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), మరియు చైతు (ప్రియదర్శి) ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అయితే, ఈ ముగ్గురు తమ జీవితాల్లో ఎవరి సమస్యతో వారు పడుతూ ఉంటారు. ఆది మంచి గిటారిస్ట్. అయితే తనకు స్టేజ్ ఫియర్ ఉండటంతో తన లవర్ వైష్ణవి (రీతూవర్మ) ఎంత సపోర్ట్ చేసినా కూడా సక్సెస్ కాలేకపోతాడు. తన తల్లి (అమల) తనతో ఉంటే బాగుండేది అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీను హౌస్ బ్రోకర్ గా పనిచేస్తుంటాడు. అయితే చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది అనుకుంటూ బాధపడుతుంటాడు. చైతుకి పెళ్లి సమస్య. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చుదు. ఇలా ఎవరి సమస్యలతో వారు జీవనం సాగిస్తుండగా..ఇలాంటి సమయంలోనే వీరి జీవితాల్లోకి సైంటిస్ట్ రంగి కుట్టా పాల్ (నాజర్) వస్తాడు. అతను కనిపెట్టిన టైమ్ మిషన్ తో ఈ ముగ్గురు తమ గతంలోకి వెళ్లి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటారు. రంగి కుట్టా పాల్ జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌కు.. ఆది జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఓ సంబంధం ఉంటుంది. దాంతో తాను కూడా ఆదిని గతంలోకి పంపించాలని అనుకుంటున్నాడు. మరి గతంలోకి వెళ్లిన ఆది త‌ల్లిని క‌లుస్తాడా? ఆదికి, రంగి కుట్టా కు మధ్య ఉన్న సంబంధం ఏంటి..? శ్రీను, చైతు తమ తప్పుల్ని సరిదిద్దుకున్నారా?లేదా? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ

టైమ్ ట్రావెలింగ్.. ఇది ఫిక్షనల్ కథ అని అందరికీ తెలిసిందే. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో జరగవు. అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చింది ఒకే ఒకజీవితం. లైఫ్ లో రెండో ఛాన్స్ రావడం అనేది జరగడం అసాధ్యం. ఒకవేళ అలాంటి అవ‌కాశం వ‌స్తే .. విధి రాత‌ను మార్చుకోగ‌ల‌మా! అనే పాయింట్‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ రాసుకున్న క‌థే ‘ఒకే ఒక జీవితం.

తెలుగు సినీ చరిత్రలో టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. కానీ టైమ్ ట్రావెలింగ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా క్లాసిక్ మూవీ ఆదిత్య 369. ఆ తరువాత సూర్య 24 సినిమా కూడా వచ్చింది. ఈసినిమా కూడా హిట్. ఇక రీసెంట్ గా వచ్చిన బింబిసార కూడా ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. అయితే ఈ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ ఒకే ఒక జీవితం సినిమా ఎమోషనల్ తో కూడిన కథ. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి.

ఇక శర్వానంద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి సెటిల్డ్ పాత్రల్లో నటించడం శర్వా దిట్ట. ఆది పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. తల్లి మీద ఉండే ప్రేమ, ఆ ఎమోషన్ ను బాగా చూపించాడు. శర్వాకు తల్లిగా అమలను తీసుకోవడంలోనే డైరెక్టర్ సగం సక్సెస్ అయ్యాడు.శర్వానంద్, అమల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్ కు గురిచేస్తాయి. రొటీన్ మ‌ద‌ర్ రోల్స్ చేసే వారిని కాకుండా ఆమె చేయ‌టం వ‌ల్ల ఆ పాత్ర‌లో కొత్తద‌నం కనిపిస్తుంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత తెలుగు తెరపై కనిపించిన అమల అక్కినేని ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా కనిపించింది. ఈసినిమాలో అమ‌ల అక్కినేని త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. శర్వా స్నేహితులుగా చేసిన వెన్నెల కిషోర్, ప్రియదర్శి కూడా ఈసినిమాకు మరో ప్రధానం అయ్యారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ మరోసారి తన ఫుల్ కామెడీతో నవ్వించేశాడు. కామెడీ మాత్రమే కాదు కొన్నిచోట్ల ఎమోషనల్ గా కూడా నవ్వించేశాడు. ప్రియదర్శి కూడా తన నటనతో మెప్పించాడు. ఇక‌ హీరోయిన్ రీతూ వ‌ర్మ పాత్ర‌కు న్యాయం చేసింది. హీరోకి తోడుగా ఉంటూ అతనికి ధైర్యాన్ని,భ‌రోసాను ఇచ్చే అమ్మాయిగా ఆమె బాగా న‌టించింది. నాజర్ కూడా బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే శ్రీ కార్తీక్ తన మేకింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ నూతన దర్శకుడు టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ అర్థమయ్యేలా డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. త‌రుణ్ భాస్క‌ర్ రైట‌ర్‌గా మంచి సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. భావోద్వేగ స‌న్నివేశాల్లో త‌న డైలాగులు మ‌రింత‌గా పండాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కు జేక్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరింత ఎమోషనల్ గా మారాయి. ఇంకా అమ్మ పాట, ఒకటే కదా పాటలు కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక ఓవరాల్ గా చెప్పలంటే ఒకే ఒక జీవితం అనే టైటిల్ తోనే మనం అర్థంచేసుకోవచ్చు. మనకు ఉండే ఈ ఒక్క జీవితంలోనే మనకి సెకండ్ ఛాన్స్ రావడం అనేది అదృష్టం. అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం మన జీవితాన్ని ఎలా మార్చుకున్నాం అనేది ముఖ్యం. ఈసినిమా ఒక మంచి ఎమోషనల్ జర్నీ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =