బ్రహ్మాస్త్రం మూవీ రివ్యూ

Brahmastra Telugu Movie Review,Brahmastram Telugu Movie Review,Brahmastra Movie Review,Brahmastram Movie Review,Brahmastram Review,Brahmastra Review,Brahmastram Telugu Review,Brahmastra Telugu Review,Brahmastra First Review,Brahmastram Part One: Shiva Movie Review,Brahmastra Part One: Shiva Movie Review,Brahmastram Movie Review And Rating,Brahmastra Movie Review And Rating,BRAHMĀSTRA,Brahmastram Movie Rating,Brahmastra Part One: Shiva,Brahmastram Part One: Shiva,Brahmāstra: Part One – Shiva,Brahmastra – Part One: Shiva Movie,Brahmastra Movie: Review,Brahmastra Movie Review 2022,Brahmastra Movie Highlights,Brahmastra Movie Plus Points,Brahmastra Movie Review Telugu,Brahmastra Movie Public Talk,Brahmastra Movie Public Response,Brahmastra 2022,Brahmastram,Brahmastra,Brahmastram Movie,Brahmastra Movie,Brahmastram Telugu Movie,Brahmastra Movie Updates,Brahmastra Telugu Movie Updates,Brahmastra Telugu Movie Live Updates,Brahmastra Telugu Movie Latest News,Amitabh Bachchan,Nagarjuna Akkineni,Ranbir Kapoor,Alia Bhatt,Mouni Roy,Ayan Mukerji,SS Rajamouli,Pritam,Hiroo Yash Johar,Karan Johar,Telugu Cinema Reviews,Telugu Movie Reviews,Telugu Movies 2022,Telugu Reviews,Telugu Reviews 2022,New Telugu Movies 2022,New Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews,Latest Kollywood Reviews,Telugu Filmnagar,Brahmastra Public Talk,Brahmastra Public Response,Ranbir Kapoor Movies,Ranbir Kapoor Brahmastra Movie Review

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ అడ్వంచరస్ మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో ఈసినిమా రిలీజ్ అవుతుంది. భారీ విజువల్స్ అలానే డిఫరెంట్ కథతో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాకోసం దేశం వ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్స్ అన్నీ సినిమాలపై అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. అంచనాలను రీచ్ అయిందా లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగర్జున, మౌనిరాయ్ తదితరులు
దర్శకత్వం.. అయాన్ ముఖర్జీ
బ్యానర్స్.. స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్
నిర్మాతలు : కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మారిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ
సంగీతం.. ప్రీతమ్
సినిమాటోగ్రఫీ : వి. మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ, వికాష్ నౌలాఖా, పాట్రిక్ డ్యూరక్స్

కథ

అస్త్రావర్స్.. అస్త్రాలను బేస్ చేసుకొని తీసిన సినిమా ఇదని అయాన్ ముఖర్జీ ముందే చెప్పాడు. ఈ థీమ్ ఏంటో కూడా ముందే చెప్పేశాడు. ఇక ఈకథ ఏంటంటే.. అస్త్రాలన్నిటికీ అధిపతి బ్రహ్మాస్త్ర. ఇక ఈ బ్రహ్మాస్త్ర ను దుృష్ట శక్తులు సొంతం చేసుకోకుండా కాపాడుతుంటారు. అందుకే దీనిని మూడు భాగాలుగా చేసి బ్రహ్మాన్ష్‌ గ్రూప్ కాపాడుతుంది. గురు(అమితాబ్) ఆ బ్రహ్మాన్ష్ ని లీడ్ చేస్తూంటాడు. అనీష్(నాగార్జున) వద్ద ఉండగా రెండవ భాగం మోహన్ భార్గవ్‌(షారుఖ్‌ ఖాన్‌) అనే సైంటిస్ట్ దగ్గర ఉంటుంది. ఇక విడి విడిగా ఉన్న మూడు భాగాలను కలపడం ద్వారా అద్భుత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ని సాధించి, ప్రయోగించాలని నిశీధి రాణి (మౌనీరాయ్) తన గ్రూప్ తో కలిసి ప్రయత్నిస్తూ ఉంటుంది.

మరోవైపు శివ(రణబీర్‌ కపూర్‌) ముంబైలో డీజే గా పనిచేస్తుంటాడు. అయితే తనకు ఎప్పుడూ అగ్నికి సంబంధించిన సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇదిలా ఉండగా తనకు ఫారిన్ రిటర్న్ అమ్మాయి ఇషా (అలియాభట్)తో పరిచయం అవుతుంది. అది ప్రేమకు దారి తీస్తుంది. ఈలోగా వాళ్లిద్దరూ ఓ పనిమీద వారణాసి వెళ్తారు. అక్కడ గురు (అమితాబ్) కలుస్తాడు. బ్రహ్మాస్త్ర ని నెగిటివ్ శక్తుల చేతులో పడకుండా చూడటం కోసం, ప్రపంచ పరిరక్షణ కోసం శివను తమతో కలవమని,సహకరించమని అడుగుతాడు. మరి గురు శివనే ఎందుకు అడుగుతాడు..? అగ్నికి శివకు ఉన్న సంబంధం ఏమిటి..? బ్రహ్మాస్త్రను ఎలా కాపాడాడు..? అతని ప్రేమ కథ ఏమైంది? బ్రహ్మాస్త్ర మూడవ భాగం ఎక్కడ ఉంది? విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఒకప్పుడు ఇలాంటి భారీ బడ్జెట్ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు చూడాలంటే హాలీవుడ్ సినిమాలే దిక్కు. కానీ ఇప్పుడిప్పుడే మన వాళ్లు కూడా మారుతున్నారు. కొత్త కాన్సెప్ట్ లతో తెరకెక్కిస్తున్న సినిమాలు ఈ మధ్య మన ముందు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్లు ఫిల్మ్ మేకర్లు కూడా… అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది.

ఇది అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా సార్లు చెప్పాడు. తన చిన్నప్పటి నుండి ఎన్నో కథలు, పురాణాలు, ఇతిహాసాలు, హాలీవుడ్ సినిమాలు తన ఈ సినిమాకు స్పూర్తి. సృష్టిలో మంచిని కోరుకునే వారు ఉంటారు చెడును కోరుకునే వారు ఉంటారు. అలాంటి చెడు శక్తుల నుండి సృష్టిని కాపాడే మంచివారు ఎప్పుడూ ఉంటారు.. ఇలాంటి పాయింట్ ను అస్త్రాలతో చెప్పడం.. దానికి విజువల్ వండర్ గా, దానికి కాస్త ప్రేమను జోడించి తెరపై ఆవిష్కరించాడు అయాన్. ఇక ఈసినిమా మొదటి షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. భారీ బడ్జెట్ తో భారీ విజువల్ వండర్ లా తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ విషయంలో గ్రాఫిక్స్ విషయంలో మాత్రం అంచనాలను ఓ రేంజ్ లో అందుకుంది అని చెప్పాలి.

ఇక నటీనటుల ఫెర్పామెన్స్ విషయానికి వస్తే రణబీర్ కపూర్ ఎప్పటిలానే తన యాక్టింగ్ తో మెప్పించాడు. లవ్ సీన్స్ చేయడంలో ను ఎక్స్ పర్ట్. అలియాతో ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలియా భట్ తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో రణబీర్ – అమితాబ్ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. షారూఖ్ ఖాన్ అదరగొట్టారు. ఆయన వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలు అవుతుంది. అనీష్ శెట్టి పాత్రలో కింగ్ నాగార్జున నటన బావుంది. కనిపించింది కాసేపే అయినప్పటికీ… ప్రభావం చూపించారు. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు.

ఇక ఇలాంటి సినిమాలకు టెక్నికల్ డిపార్ట్మెంట్ కీలక పాత్ర వహిస్తుంది. అవి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయితే సినిమా అంత హైలెట్ అవుతుంది. ఈసినిమాకు కూడా టెక్నికల్ టీమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక ప్రీతమ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here