కెప్టెన్ మూవీ రివ్యూ

Captain Telugu Movie Review,Captain Movie Review,Captain Review,Captain Telugu Review,Captain Movie Review In Telugu,Captain Telugu Movie (2022),Captain,Captain Movie,Captain Telugu Movie,Captain Review - Telugu,Captain Movie Reviews,Captain - Telugu Movie Reviews,Captain Movie Public Talk,Captain Movie Public Response,Captain Movie Updates,Captain Telugu Movie Updates,Captain Telugu Movie Live Updates,Captain Telugu Movie Latest News,Captain Movie Plus Points,Captain Movie Highlights,Captain Movie Story,Captain (2022),Captain (2022) - Movie,Captain Movie First Review,Captain (2022) Telugu Movie,Arya,Aishwarya Lekshmi,D Imman,Shakti Soundar Rajan,Telugu Cinema Reviews,Telugu Movie Reviews,Telugu Movies 2022,Telugu Reviews,Telugu Reviews 2022,New Telugu Movies 2022,New Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews,Latest Kollywood Reviews,Telugu Filmnagar,Arya Movies,Arya New Movie,Arya Latest Movie,Arya New Movie Review,Arya Captain Telugu Movie Review,Arya Captain Movie Review,Arya Captain Review,Captain Movie Pre Review,Captain Review And Rating

తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కెప్టెన్. ఫస్ట్ ఇండియన్ క్రియేచర్ ఫిలింగా వస్తున్న ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. హిట్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. ఆర్య, ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్, మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్
దర్శకత్వం.. శక్తి సౌందర్ రాజన్
బ్యానర్స్..థింక్ స్టూడియోస్
నిర్మాతలు.. ఆర్య
తెలుగు సమర్పకులు.. శ్రేష్ట్ మూవీస్
సంగీతం.. డి ఇమాన్
సినిమాటోగ్రఫి.. ఎస్. యువ
ఎడిటర్.. ప్రదీప్ ఇ. రాఘవ్

కథ
ఇండియన్ ఆర్మీలో విజయ్ కుమార్ (ఆర్య) కెప్టెన్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఎంతటి ఆపరేషన్ అయినా సరే సాహసంగా దూకుడుగా ముందుకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తుంటాడు. ఇదిలా ఉండగా భారతదేశంలోని ఈశాన్య అటవీ ప్రాంతంలో, సెక్టార్ 42 అనేది 50 సంవత్సరాల నుండి పౌర కార్యకలాపాలు లేదా సైనిక కార్యకలాపాలు లేని ప్రదేశం. భారత ప్రభుత్వం దీని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈనేపథ్యంలో ముందు వెళ్లిన ఓ రెండు బ్యాచ్ లు అనుకోని విధంగా కనిపించకుండా పోతాయి. దాంతో ఆ మిస్టరీని తెలుసుకోవడానికి కెప్టెన్ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందాన్ని అక్కడికి చేరుకోవడానికి సిద్ధం చేస్తుంది. అయితే అక్కడికి వెళ్లిన విజయ్ కు పలు సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి కారణం అక్కడ ఉండే వింత జీవులు అని అర్థమవుతుంది. ఇక విషయం తెలుసుకున్న అతను ప్రాణాలను పణంగా పెట్టి మరీ వాటిని ఎలా ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో అతను సక్సెస్ అయ్యాడా… అసలు ఈ వింత జీవులు ఎవరు…వారి వెనక ఉన్నవారు ఎవరు…ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నిజానికి ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద జరగలేదనే చెప్పొచ్చు. తెలుగులో అయితే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు తప్పా. ఇక్కడ ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. కానీ కొన్ని సినిమాలకు ఇదే కలిసొస్తుంది. కెప్టెన్ సినిమాకు కూడా ఇదే అంశం కలిసొచ్చింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. సినిమాపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసినా తుస్సుమన్న సినిమాలు చాలా ఉన్నాయి. అయితే కెప్టెన్ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడంతో మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.

ఈసినిమా కాన్సెప్ట్ ఏంటో హలీవుడ్ సినిమాలు చూసే వాళ్లకు ఓ ఐడియా ఉంటుంది. ముందుగా ప్రెడేటర్ లాంటి సినిమాలు గుర్తుకువస్తాయి. మొదటి నుండీ శక్తి సౌందర్ రాజన్ భారతీయ సినిమా చరిత్రలో చాలా అరుదుగా కనిపించే జానర్‌లతో సినిమాలు తీస్తుంటారు. ఈసారి కూడా కెప్టెన్ లాంటి విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శక్తి సౌందర్ రాజన్ ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ ను రాసుకోవడం దాన్ని సినిమాగా తెరకెక్కించిన దానికే ముందు అభినందించవచ్చు. తక్కువ నిడివితో, మంచి స్క్రీన్ ప్లే తో కథను రాసుకోవడంతో సినిమాకు మంచి టాక్ వస్తుంది.

ఇక నటీ నటుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే ఆర్య త‌న వ‌ర‌కూ పూర్తిగా న్యాయం చేశాడు. కెప్టెన్‌కు కావాల్సిన ఫిట్‌నెస్‌, ఫిజిక్ హీరో ఆర్యలో ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లో బాగా చేశాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా తనకు ఇచ్చిన పాత్రలో బాగానే నటించింది. చాలా తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినా సిమ్రాన్ ఆకట్టుకుంది. మిగతా నటీనటులందరూ సినిమాకు అవసరమైన విధంగా తమ వంతు పాత్రను చక్కగా అందించారు.

సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు ప్రధానంగా కావాల్సిందే విఎఫ్ఎక్స్. ఈసినిమాలో కూడా విజువల్స్ బాగానే ఉన్నాయి. కెమెరా వ‌ర్క్ బాగుంది. ఇమాన్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. తను అందించిన సంగీతం స్క్రీన్‌పై ఉన్న పరిస్థితులకు తగినట్లుగా ఉంటుంది మరియు ఈ చిత్రాన్ని చూడటానికి అవసరమైన మూడ్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే కెప్టెన్ రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు డిఫరెంట్ గా వచ్చిన మూవీ. ప్రయోగాత్మక సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =