లైగర్ మూవీ రివ్యూ

Actress Ananya Panday, Bollywood Actress Ananya Panday, latest telugu movies news, Liger, Liger – Reviews, Liger – Telugu Movie Reviews, Liger 2022, Liger 2022 – Movie, Liger 2022 film, Liger 2022 Movie Rating, Liger Climax review, Liger Critics Review, Liger Film, Liger First Movie Review Out, Liger Movie, Liger Movie (2022), Liger Movie Highlights, Liger Movie Latest Updates, Liger Movie Open Advance Ticket Booking, Liger Movie Plus Points, Liger Movie Public Response, Liger Movie Public Talk, Liger Movie Rating, Liger Movie Review, Liger Movie Review 2022, Liger Movie Review And Rating, Liger Movie Review Out, Liger Movie Review Telugu, Liger Review, Liger Review 2022, Liger Story review, Liger Telugu Movie, Liger Telugu Movie Review, Liger Telugu Review, Puri Jagannadh, Puri Jagannadh Liger Movie Releasing on 25th August, Rowdy Vijay Deverakonda, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Vijay Deverakonda, Vijay Deverakonda And Ananya Panday, Vijay Deverakonda Upcoming movie Liger

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది. హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కు హిట్ దక్కిందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్, విషు రెడ్డి, రోనిత్ రాయ్ తదితరులు
దర్శకత్వం..పూరీ జగన్నాథ్
బ్యానర్స్.. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
నిర్మాతలు..పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా
సినిమాటోగ్రఫి.. విష్ణు శర్మ

కథ..
లైగర్ (విజయ్ దేవరకొండ) తన తల్లి (రమ్యకృష్ణ) తో కలిసి ఎంఎంఏ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) ట్రైనింగ్ కోసం కరీంనగర్ నుండి ముంబై వెళతారు. ఎంఎంఏ ట్రైనింగ్ సెంటర్ దగ్గర హెల్పర్ గా పనిచేస్తూ తనలో ఉన్న స్కిల్స్ ను చూపించడానికి మంచి టైం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు అనన్య పాండేతో ప్రేమలో పడతాడు. అయితే కొన్ని పరిస్థితుల ద్వారా లవ్ కూడా బ్రేకప్ అవుతుంది. ఇక ఆతరువాత తన కెరీర్ పై ఫోకస్ పెట్టి ఎంఎంఏ ఫైటింగ్ కోసం రింగ్ లో దిగుతాడు. అలా నేషనల్ ఛాంపియన్ గా గెలుస్తాడు. ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ కోసం క్వాలిఫై అవుతాడు. ఇక ఛాంపియన్ షిప్ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ను కలుస్తాడు. మరి లైగర్, మైక్ టైసన్ మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. లైగర్ ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఛాంపియన్ షిప్ ఎలా గెలుస్తాడు.. ఆఖరికి తన ప్రేమను పొందాడా లేదా అన్నది మిగిలిన కథ.

పూరీ సినిమాలంటే ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. హీరో క్యారెక్టరైజన్ ఇంకా డైలాగ్స్ ఇవే పూరీ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఈసినిమాలో కూడా పూరీ తీసుకున్న పాయింట్ చిన్నదే అయినా కూడా తనదైన స్టైయిల్ లో పూరీ కథను నడిపించేశాడు. ఇక పూరీ జగన్నాథ్ లాంటి డైరెక్టర్ గా యంగ్ అండ్ ఇంకా పూరీ లాగే బోల్డ్ గా ఉండే విజయ్ లాంటి హీరో దొరికితే ఎలా ఉంటుంది. లైగర్ సినిమా చూస్తే అలా ఉంటుంది. సినిమా ప్రారంభం ముందే ఎంఎంఏ విజువల్స్ తో ఆడియన్స్ మూడ్ ను సెట్ చేసిన పూరీ అక్కడి నుండి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లాడు. ఇక ఎంఎంఏ రూట్స్ ను డీటైల్ గా అలానే కరీంనగర్ నుండి ముంబై వెళ్లే ఫైటర్ యొక్క నెటివిటీ ఎలిమెంట్స్, ఒరిజినాలిటీ ఇలా అన్ని విషయాలను పూరీ చక్కగా చూపించాడు. విజయ్ ఇంట్రడక్షన్ సీన్ అలానే విజయ్ లోని ఫైటింగ్ స్కిల్స్ ను పూరీ బాగా ఎలివేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లోని ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి ఎంఎంఏ మ్యాచ్ సీన్స్ అన్నీ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు.

ఇక ఈసినిమాకు విజయ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. విజయ్ దేవరకొండ ఎంఎంఏ ఫైటర్ క్యారక్టర్ కి తగినట్లు గా తన బాడీని అద్బుతంగా రెడీ చేసుకున్నారు. అలాగే తన క్యారక్టర్ ను ఎనర్జీ తో సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. వన్ మ్యన్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మైక్ టైసన్ తో వచ్చే సీన్స్ లో తనను తాను ప్రెజెంట్ చేసుకున్న విధానం విజయ్ దేవరకొండలో ఉన్న డెడికేషన్ ని చూపిస్తుంది. మిగతా ఫైట్స్ లోనూ దేవరకొండ ఓ యాక్షన్ మాస్ హీరోలా కనిపిస్తారు.

ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్. విజయ్ తల్లిగా మాస్ పాత్రలో మరోసారి రమ్యకృష్ణ తనలోని వర్సిటాలిటీ చూపించింది. ఇక అనన్య పాండే ఈసినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈసినిమాలో తన గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అలానే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. వీరితో పాటు ఇంటర్నేషనల్ ఫిగర్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ స్పెషల్ ఎట్రాక్షన్. విజయ్ దేవరకొండ తో తన ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల మేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగానికి వస్తే పాటలు సినిమా రిలీజ్ కు ముందే ఆకట్టుకున్నాయి. సినిమాలో వచ్చే పరిస్థితులకు తగట్లుగా పాటలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా హైలైట్ గా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్ స్టంట్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nine =