క‌మిట్ మెంట్‌ మూవీ రివ్యూ

Commitment Movie Review

హైద‌రాబాద్ న‌వాబ్స్ ఫేం ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో తేజ‌స్వి మ‌డివాడ, అన్వేషి జైన్, ర‌మ్య ప‌సుపిలేటి‌, సూర్య శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం క‌మిట్ మెంట్‌. ల‌వ్, డ్రీమ్,హోప్‌, ఫైట్ అనే నాలుగు భిన్న‌మైన స్టోరీల‌తో ఈ చిత్రం సాగుతుంది. ఐదుగురు మ‌హిళ‌ల జీవితంలోకి పురుషులు ఎంట‌రైన త‌ర్వాత వారి జీవితాల‌పై క‌మిట్ మెంట్ ప్ర‌భావం ఎలా ప‌డిందనేది కథా వృత్తాంతంతో వస్తున్న ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, అమిత్ తివారీ, శ్రీనాథ్ మాగంటి, రమ్య పసుపులేటి, సూర్య శ్రీనివాస్, సిమర్ సింగ్, తనిష్క్ రాజన్ మరియు రాజా రవీంద్ర
దర్శకుడు.. లక్ష్మీకాంత్ చెన్నా
బ్యానర్స్..ర‌చ‌న మీడియా వ‌ర్క్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో ఎఫ్3 ప్రొడ‌క్ష‌న్, ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు.. బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి
సంగీతం..నరేష్ కుమారన్
సినిమాటోగ్రఫీ.. సజీష్ రాజేంద్రన్, నరేష్ రానా

కథ..

ఈసినిమా నలుగురు యువతుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్టు ఇప్పటికే అర్థమైపోయింది. ఒక సినిమా నటి, ఒక డాక్టర్, ఒక యుక్తవయస్కురాలు, ఒక విద్యార్థి మరియు ఒక జూనియర్ డాక్టర్ వారి లక్ష్యాలతో జీవితంలో ముందుకు వెళుతుంటారు. ఇక ఎవరి లక్ష్యాల్లో వారు ఉండగా వారి జీవితాల్లోకి వేరే వ్యక్తులు వస్తారు. అలా వచ్చినవారు కమిట్ మెంట్ ఇవ్వమని అడుగుతారు. మరి ఈసమస్య వల్ల ఆ ఐదుగురు మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు.. ఈ సమస్య వల్ల అమ్మాయిల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మిగిలిన కథ..

నేటి మహిళలు ఎదుర్కొనే ఒక సమస్యను ఆధారంగా తీసుకొని ఈసినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ లక్ష్మీకాంత్. కమిట్ మెంట్ అనేది ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న ఒక సమస్య. అయితే ఈ సమస్యను ఒక్కొక్కరూ ఒక్కోలా ఎదుర్కొంటుంటారు. కొంతమంది మహిళలు కాస్త ధైర్యంగా ఒంటరిగానే తమ సమస్యను ఎదుర్కొంటే.. కొంతమంది ఎవరో ఒకరి సపోర్ట్ ద్వారా ఎదుర్కొంటుంటారు.. కొంతమంది మహిళలు మాత్రం తమలోనే వేదన పడుతుంటారు.

ఇదే పాయింట్ తీసుకుని కమిట్ మెంట్ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా. నిజానికి చూడటానికి ఈసినిమా కాస్త బోల్డ్ కంటెంట్ తో ఉన్నా ఆలోచించాల్సిన పాయింట్ ఉంది. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ నే నేటి యువతను కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త అడల్ట్ కంటెంట్ తో తెరకక్కించినట్టు అర్థమవుతుంది.

ఇక నటీనటుల నటన విషయానికొస్తే సినిమాలో ఎక్కువభాగం ప్రధానపాత్రల్లో నటించిన హీరోయిన్స్ దే ఉంటుంది. అందులో తేజస్వి మదివాడ తనదైన నటనతో ఆకట్టుకుంది. రమ్య పసుపులేటి పర్వాలేదనిపించింది. ఇతర నటులు తమ పాత్రలలో మెప్పించారు. ఇతర నటుల్లో అమిత్ తివారీ, రాజా రవీంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు.

నరేష్ కుమారన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. పాటలు కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + seventeen =