నేను సినిమాల్లోకి వస్తానంటే నాన్న వద్దన్నారు..!

Dulquer Salmaan About His Industry Entry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Star Hero Dulquer Salmaan,Dulquer Salmaan Movie Latest Updates,Dulquer Salmaan New Movie Updates, Dulquer Salmaan About Entery in Film Industry,Dulquer Salmaan Career in Film Industry,Dulquer Salmaan Upcoming Movie Updates,Dulquer Salmaan latest Movie Sita Ramam

వారసులు ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉండేదే. అయితే ఎక్కడో కొంతమంది మాత్రమే వేరే వృత్తులను ఎంచుకుంటారు. అయితే ఓ స్టార్ హీరో మాత్రం తను సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదని అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తాజాగా సీతారామం సినిమాతో మంచి హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్. అయితే తను నటించిన సీతారామం సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మహానటితోనే ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఇక ఈసినిమాతో మరింత దగ్గరైపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందువల్లనే ఫైట్లు .. డాన్సులు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టుగానే చదువుకుని .. దుబాయ్ లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. అందువల్లనే కేరళకి తిరిగి వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. నువ్వెప్పుడూ డ్యాన్స్ చేయడంగానీ .. నటించడానికి ట్రై చేయడం గాని నేను చూడలేదు. యాక్టింగ్ నువ్వు అనుకున్నంత తేలిక కాదు .. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచన చేయకు’ అంటూ నాపై మండిపడ్డారు. తరువాత నేను ఎంట్రీ ఇచ్చిన తరువాత మారిపోయారు. ఇప్పుడు ఆయన నా ప్రతి సినిమా చూసి సూచనలు ఇస్తుంటారు అని చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + three =