‘స్వాతిముత్యం’ రిలీజ్ డేట్ వాయిదా..!

Swathi Mutyam Release Date Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Swathi Mutyam,Swathi Mutyam Movie,Swathi Mutyam Telugu Movie,Swathi Mutyam Movie Postponde,Swathi Mutyam Movie Postponde,Swathi Mutyam Telugu Movie Postponde, Swathi Mutyam Movie Latest Updates,Swathi Mutyam Movie Release Date Postponde,Bellamkonda Sai Srinivas's Younger Brother Ganesh Bellamkonda, Ganesh Bellamkonda Debut Movie Swathi Mutyam,Ganesh Bellamkonda First Movie Swathi Mutyam Release Date Postponde

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. స్వాతిముత్యం అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు కానీ కరోనా వల్లనే చాలా లేట్ అయింది. అయితే ఇటీవలే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆగష్ట్ 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. ఈసినిమాను ఆగష్ట్ 13వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నాం ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఈసినిమా షూటింగ్ పూర్తయింది. రిలీజ్ డేట్ను దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తున్నా. అయితే ఇప్పుడు కొన్ని కారణాలవల్ల రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నాం. ఈ నిర్ణయంపట్ల మేం సంతోషంగా లేనప్పటికీ, వాయిదా వేయక తప్పడం లేదు. పోస్ట్ పాండమిక్ తరువాత కూడా ఆడియన్స్ ఇంతకుముందు థియేటర్స్ కు వచ్చినట్టు రావడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో వేరే సినిమాలతో కూడా మేము పోటీ పడాలని అనుకోవడం లేదు.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి ఇంతకుముందు లాగ సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాం అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =