నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’.
రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో నితిన్ మొదటిసారి నటిస్తున్నాడు. ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక కామెడీ, యాక్షన్ సీన్లతో ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌లో చూపించిన డైలాగ్‌లు, నితిన్ యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ లో‘కలెక్టర్ గా మాచర్లలో ఎన్నికలు జరిపించడం నా బాధ్యత’, ‘నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా పంచ్ లు వీళ్ళేమో బోయపాటి శ్రీనివాస్ లా యాక్షన్ ఇప్పుడు నేనేమి చేయాలి రాజమౌళి సినిమాలో హీరోలా ఎలివేషన్ ఇవ్వాలా’, ‘కలెక్టర్ మీద చేయి వేస్తే గవర్నమెంట్ మీద చేయి వేసినట్లే’ అంటూ ట్రైలర్ లో నితిన్ పలికే పవర్ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి.
Loved this action packed trailer of #MacherlaNiyojakavargam 👌👍🏻 @actor_nithiin’s Mass show all over🔥
My best wishes to the entire team 😊Looking forward👍🏻– https://t.co/czqtCwWfcB @SrSekkhar @IamKrithiShetty @CatherineTresa1 #MahathiSwaraSagar @SreshthMovies
— Anil Ravipudi (@AnilRavipudi) July 30, 2022
కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: