‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ

Divyasha Kaushik, Divyasha Kaushik Movies, Latest Telugu Movie Reviews 2022, latest telugu movies news, Latest Telugu Review, Latest Telugu Reviews 2022, latest tollywood updates, New Telugu Movie Reviews 2022, Rajisha Vijayan, Rama Rao on Duty (2022), Rama Rao On Duty Critics Review (2022), Rama Rao On Duty Movie, Rama Rao On Duty Movie FDFS Review, Rama Rao On Duty Telugu Movie, Rama Rao On Duty Updates, Ramarao On Duty, Ramarao on Duty (2022 film), Ramarao on Duty (2022), Ramarao on Duty (2022) – Movie, Ramarao On Duty Movie, Ramarao on Duty movie First Review, Ramarao on Duty movie First Review out, Ramarao on Duty Movie Highlights, Ramarao on Duty Movie Latest News, Ramarao on Duty Movie Plus Points, Ramarao on Duty Movie Premior Show Review, Ramarao on Duty Movie Public Response, Ramarao on Duty Movie Public Talk, Ramarao on Duty Movie Rating, Ramarao on Duty Movie Review, Ramarao on Duty Movie Review 2022, Ramarao on Duty Movie Review And Rating, Ramarao on Duty Movie Review Telugu, Ramarao on Duty Movie Telugu Review, Ramarao On Duty Movie Updates, Ramarao on Duty Public Response, Ramarao on Duty Public Talk, Ramarao on Duty Review, Ramarao on Duty Review 2022, Ramarao on Duty Review And Rating, Ramarao On Duty Telugu Movie, Ramarao on Duty Telugu Movie 2022, Ramarao on Duty Telugu Movie Latest News, Ramarao on Duty Telugu Movie Live Updates, Ramarao on Duty Telugu Movie Review, Ramarao on Duty Telugu Movie Review And Rating, Ramarao on Duty Telugu Movie Updates, Ramarao on Duty Telugu Review, Ramarao on Duty The Movie, Ravi Teja, ravi teja latest movie, Ravi Teja Latest Movie Review, Ravi Teja movies, Ravi Teja new movie, Ravi Teja New Movie Review, Ravi Teja Ramarao on Duty Movie Review, Sam C S, Sarath Mandava, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Reviews 2022, Tollywood Movie Updates, Venu Thottempudi

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వస్తున్నాడు. మరి సినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. నేడు ఈసినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసారి ఈసినిమా రవితేజ కు ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రవితేజ, దివ్యాంశ కౌశిక్, ర‌జిష, వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ తదితరులు
దర్శకత్వం.. శరత్ మండవ
బ్యానర్స్.. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌
సినిమాటోగ్రఫి.. స‌త్య‌న్ సూర్య‌న్
సంగీతం.. శ్యామ్ సీఎస్

కథ..

నీతి నిజాయితీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయనాయకుల నుండి అలానే ఉన్నతాధికారుల నుండి కూడా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎదురించి సైతం బాధ్యతలు నిర్వహించే ఓ ఆఫీసర్ కథే ఈ సినిమా. రామారావు (రవితేజ) ఓ డిప్యూటీ కలెక్టర్. అయితే కొన్ని కారణాల వల్ల డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎమ్మార్వోగా వేరే ఊరికి బదిలీ అవుతాడు. ఇక అక్కడ చిన్ననాటి ప్రేయసి మాలిని (రజిష విజయన్) భర్త సురేందర్ (చైతన్య కృష్ణ) ఏడాది పాటుగా కనిపించకుండా పోతాడు. అయితే ఆ కేసును ఎస్సై మురళీ (వేణు తొట్టెంపూడి) పట్టించుకోవడం లేదని తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆక్రమంలో దాదాపు 20 మంది మిస్ అయ్యారన్న షాకింగ్ నిజం తెలుస్తుంది. దీనికి ఎర్ర చందనం స్మగ్లింగ్ కూడా కారణం అని తెలుస్తుంది. అసలు ఎర్రచందన స్మగ్లింగ్‌కు, 20 మంది కనిపించకుండా పోవడానికి ఉన్న లింక్ ఏంటి? చివరకు రామారావు తన డ్యూటీని పూర్తి చేశాడా? లేదా? అన్నదే కథ.

విశ్లేషణ..

మాస్ మహారాజా రవితేజ బిగ్ స్క్రీన్లపై ఆడియన్స్‌ను ఎంత‌గా అల‌రిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన ఎనర్జిటిక్ నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. కామెడీ పాత్రలైనా, సీరియస్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లు అయినా పాత్రలో ఒదిగిపోతుంటాడు. ఇక ఇప్పుడు ఈసినిమాలో కూడా ప్రభుత్వ ఉద్యోగిగా, నీతి నిజాయితీకి నిలబడే వ్యక్తిగా కొత్త పాత్రలో నటించి మెప్పించాడు. రెగ్యులర్ ఫార్మట్ ను పక్కనపెట్టి ఈసినిమా చేయడానికి అంగీకరించాడు. ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథ ప్రధానంగా సాగే సినిమా ఇది. డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో హై ఓల్టేజ్ డైలాగ్స్‌తో మాస్ మాహారాజా అదరగొట్టేసాడు. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చు.

ఇక వేణు తొట్టెంపూడి ఈసినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మాజీ హీరో వేణు కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. సామి…’ అంటూ డిఫరెంట్ స్టైల్‌లో డైలాగులు చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో మాలిని భర్త.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. రజిషా మాలిని పాత్రలో చక్కగా నటించారు. రవితేజ భార్యగా దివ్యాంశ‌ కౌశిక్ కూడా బాగా సెట్ అయింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ఇక శరత్ మండవకు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమానే అయినా రవి తేజను కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. డిఫరెంట్ థీమ్ తో శరత్ ఈసినిమాను తెరకెక్కించాడు. థీమ్ తో పాటు శరత్ మండవ రాసుకున్న క‌థలో కంటెంట్ కూడా ఉండటంతో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ కి అయితే ఈసినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ర‌వితేజ ఫ్యాన్స్ కి మాంచి కిక్కిచ్చే సినిమా అని చెప్పాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =