‘థాంక్యూ’ మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ..!

Dil Raju, Latest telugu movie reviews, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, latest tollywood updates, Naga Chaitanya, New Telugu Movie Reviews 2022, New Telugu Movies 2022, Raashi Khanna, Telugu cinema reviews, Telugu Film News 2022, Telugu Filmnagar, telugu movie reviews, Telugu Movies 2022, Telugu Reviews, Telugu Reviews 2022, Thaman S, Thank You, Thank You (2022 film), Thank You (2022), Thank You (2022) – Movie, Thank You Movie, Thank You movie First Review out, Thank You Movie Highlights, Thank You Movie Latest News, Thank You Movie Plus Points, Thank You Movie Pre Review, Thank You Movie Premiere Show Response, Thank You Movie Public Response, Thank You Movie Public Talk, Thank You Movie Rating, Thank You Movie Review, Thank You Movie Review 2022, Thank You Movie Review And Rating, Thank You Movie Review Telugu, Thank You Movie Telugu Review, Thank You Movie Updates, Thank You Pre Review, Thank You Premiere Show Response, Thank You Public Response, Thank You Review, Thank You Review 2022, Thank You Review And Rating, Thank You Telugu Movie, Thank You Telugu Movie 2022, Thank You Telugu Movie Latest News, Thank You Telugu Movie Live Updates, Thank You Telugu Movie Pre Review, Thank You Telugu Movie Premiere Show Response, Thank You Telugu Movie Updates, Thank You Telugu Review, Thank You Teugu Movie Review, Thank You The Movie, Tollywood Movie Updates, Vikram K Kumar

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైత‌న్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. మనం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా అప్ డేట్స్ తో కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఇక నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. నాగ చైతన్య కు మరో హిట్ దక్కిందో?లేదో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. నాగచైతన్య, రాశీఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం.. విక్రమ్ కుమార్
బ్యానర్స్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్
నిర్మాతలు.. దిల్ రాజు
సంగీతం.. థమన్
సినిమాటోగ్రఫి.. పీసీ శ్రీరామ్

కథ..

అభిరామ్ (నాగ చైతన్య) అమెరికాకు ఉద్యోగం కోసం వ‌స్తాడు. రావ్ క‌న్స‌ల్‌టెన్సీ య‌జ‌మాని రావ్‌(ప్ర‌కాష్ రాజ్‌) సహకారంతో ఉద్యోగంలో చేరుతాడు. అయితే మరోవైపు తను వైద్య అనే మెడిక‌ల్ యాప్‌ను క‌నిపెడ‌తాడు. అదే క‌న్స‌ల్‌టెన్సీలో ప‌నిచేసే ప్రియ (రాశీ ఖ‌న్నా) అభిరామ్ ప్రేమ‌లో ప‌డుతుంది. అంతేకాదు త‌న యాప్‌ డెవలప్ కు కూడా ఆర్థికంగా సహాయపడుతుంది. అలా తను చేసిన యాప్ పలు కంపెనీల‌కు న‌చ్చ‌టంతో అక్క‌డ నుంచి అభిరామ్ లైఫ్ మారిపోతుంది. అయితే అక్కడి నుండి అభిరామ్ లో మార్పు వస్తుంది. తనకు ఎవరి సహాయం లేకుండా ఎదిగాను అనుకుంటూ గర్వం పెరిగిపోతుంది. ఎవరిని పట్టించుకొని పరిస్థితిలో ఉంటాడు. ఇదిలా ఉండగా అభిరామ్‌ను త‌న క‌న్స‌ల్‌టెన్సీ త‌ర‌పున సాయం అడ‌గ‌టానికి రావ్ వ‌స్తాడు. కానీ అభిరామ్ అతనిని అవ‌మానించి పంపేస్తాడు. దాంతో ఆయ‌న గుండెపోటుతో క‌న్నుమూస్తాడు. అభిరామ్ లో వచ్చిన ప్ర‌వ‌ర్త‌న చూసి ప్రియ‌ కూడా విడిపోతుంది. తను గొప్ప స్థాయికి వచ్చేందుకు సాయపడిన వాళ్లను గుర్తు చేస్తుంది. దీంతో అతని విజయం వెనుక చాలా మంది వ్యక్తులు ఉన్నారని అతను తెలుసుకుంటాడు, అప్పటి నుండి అతను వారి పట్ల తన కృతజ్ఞత చూపాలని నిర్ణయించుకుంటాడు, చివరకు అతను తన కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపిస్తాడు? తన ప్రయాణంలో ఎంత మంది ఉన్నారు.. చివరికి ప్రియ, అభిరామ్ లు ఒకటవుతారా లేదా అన్నది మిగిలిన కథ

విశ్లేషణ..

ప్రతి మనిషి జీవితంలో ఎంతోమంది ప్రోత్సాహం, సహకారం ఉంటుంది. మన జీవితంలో మన సక్సెస్ కు మనకు తెలిసి కొంతమంది, తెలియకుండా కొంతమంది సహాయపడుతుంటారు. అలాంటి వారి సహాయాన్ని మరిచిపోకూడదని.. వాళ్లను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి, థాంక్స్ చెప్పాలి అనే పాయింట్ నే ఈసినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు విక్రమ్ కుమార్. ఇక ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి ఎక్కువ పోకుండా ఎమోషనల్ రైడ్ గానే విక్రమ్ తెరకెక్కించాడు.

ఇక నాగ చైతన్య వరుసగా హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మజిలీ నుండి చైతు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. బ్లాక్ బస్టర్లు ఏమో కానీ.. డీసెంట్ హిట్లను మాత్రం అందుకుంటున్నాడు. ఇప్పుడు థాంక్యూ సినిమాతో వచ్చేశాడు. అయితే ఈసినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తుంది కాబట్టి ముందు నుండీ అంచనాలు ఉన్నాయి. మనం లాంటి క్లాసిక్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈసినిమాపై అందరిలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఇక ఈసినిమాలో కూడా చైతు మాత్రం తన నటనతో ఆకట్టుకున్నాడు. 17 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు మరియు అతను లుక్స్ మరియు బాడీ లాంగ్వేజ్ పరంగా దాదాపు 4 వేరియేషన్స్ ని అద్భుతంగా చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చైతు కు ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చు. ఇక నటుడిగా సినిమా సినిమాకు చైతు తన నటనను ఇంప్రూ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి.. పాత్రలలోని వేరియేషన్స్ ను కూడా బాగా చూపించగలిగాడు.

రాశీ ఖ‌న్నాత‌న పాత్ర ప‌రిధి మేర‌కు బాగానే న‌టించింది. త‌ను ప్రేమించి లివ్ ఇన్ రిలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తి మారిపోయిన‌ప్పుడు ఓ ప్రేమికురాలు ప‌డే మాన‌సిక‌మైన ఒత్తిడిని న‌ట‌న‌తో చ‌క్క‌గా ఎలివేట్ చేసింది. పార్వతీ పాత్రలో మాళవికా మరో కీ రోల్ చేసింది. ప్లాష్ బ్యాక్ లో ఆమె క్యారెక్టర్ నాగచైతన్యతో పాటు లీడ్ చేస్తుంది అవికా గోర్, ప్ర‌కాష్ రాజ్‌, ఈశ్వ‌రీ రావ్‌, తుల‌సి, సంప‌త్, భ‌ర‌త్‌, శ‌శాంక్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధులు మేర‌కు చ‌క్క‌గా న‌టించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు సినిమాటోగ్రఫీ మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. యూఎస్ ను అందంగా చూపించిన ఆయన ఫ్రేమ్స్, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో పల్లెటూరి వాతావరణాన్ని మరింత కలర్ ఫుల్ గా తెరకెక్కించారు. థమన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది. అయితే మాస్ ఆడియన్స్ కు ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పలేం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here