రామ్ ‘ది వారియర్’ మూవీ రివ్యూ

Aadhi Pinnishetty, Devi Sri Prasad, Krithi Shetty, latest telugu movies news, N.Lingusamy, Ram Pothineni, Telugu Film News 2022, Telugu Filmnagar, The Warriorr, The Warriorr (2022), The Warriorr (2022) – Movie, The Warriorr (2022) Telugu Movie, The Warriorr (film), The Warriorr (Telugu) (2022), The Warriorr FDFS Review, The Warriorr First Review, The Warriorr First Review Out, The Warriorr Highlights, The Warriorr Movie, The Warriorr Movie (2022), The Warriorr Movie Censor Review, The Warriorr Movie First Review, The Warriorr Movie Highlights, The Warriorr Movie Latest News, The Warriorr Movie Latest News and Updates, The Warriorr Movie Plus Points, The Warriorr Movie Pre Review, The Warriorr Movie Premiere Show Response, The Warriorr Movie Premiere Show Review, The Warriorr Movie Public Response, The Warriorr Movie Public Talk, The Warriorr Movie Review (2022), The Warriorr Movie Review And Rating, The Warriorr Movie Story, The Warriorr Movie Updates, The Warriorr Pre Review, The Warriorr Premiere Review, The Warriorr Premiere Show Review, The Warriorr Public Response, The Warriorr Public Talk, The Warriorr Review And Rating, The Warriorr Telugu Movie, The Warriorr Telugu Movie Cast & Crew, The Warriorr Telugu Movie Latest News, The Warriorr Telugu Movie Live Updates, The Warriorr Telugu Movie Review, The Warriorr Telugu Review, Tollywood Latest News, Tollywood Movie Updates

లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న సినిమా ది వారియర్. ఈసినిమాతో మొదటిసారి రామ్ తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో తమిళ్ ఎంట్రీ అవుతున్నందుకు రామ్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. ఇక ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. ఈనేపథ్యంలో భారీ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా రామ్ కు ఎలాంటి విజయాన్ని అందించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు
దర్శకత్వం.. లింగుస్వామి
బ్యానర్స్.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్
నిర్మాత.. శ్రీనివాస చిట్టూరి
సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి.. సుజిత్ వాసుదేవ్

కథ:

సత్య (రామ్) ఒక డాక్టర్. కర్నూలులోని హాస్పిటల్ కి వస్తాడు. మరోవైపు అదే ఊరిలో గురు (ఆది పినిశెట్టి) తన అక్రమాలతో రాజ్యం ఏలుతుంటాడు. ఈ క్రమంలో గురు అన్యాయాలకు సత్య ఎదురు తిరుగుతాడు. అలా ఇద్దరి మధ్య స్టార్ట్ అవుతుంది. మరోవైపు సత్య విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అంతలో గురు, సత్య పై ఎటాక్ చేస్తాడు. ఆ తర్వాత సత్య ఏమయ్యాడు ? ఐపీఎస్ గా ఎందుకు మారాడు..? కర్నూలు కి పోలీస్ గా వచ్చిన సత్య ఏమి సాధించాడు ? చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ..

లింగుస్వామి డైరెక్షన్ గురించి తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో ఆయన స్టైల్ వేరు. ఈసినిమా ను కూడా అదే మాస్ యాంగిల్ లో తీశాడు. ఇక ఫస్ట్ హాఫ్ రామ్ ఎంట్రీ, రామ్- కృతిశెట్టి మ‌ధ్య ల‌వ్ తో ఆ స‌న్నివేశాలు స‌ర‌దాగా అనిపిస్తాయి. ఆ తరువాత గురు ఎంట్రీ, రామ్ గురు ల మధ్య గొడవ మొదలవుతుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ స‌న్నివేశాలు ఆస‌క్తి రేకెత్తిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ దాదాపు గురు వ‌ర్సెస్ స‌త్య అన్న‌ట్టుగానే సాగుతుంది. ఇక ఈసినిమాకు తీసుకున్న పాయింట్ అందరికీ తెలిసిందే అయినా దానిని కొత్తగా ప్రెజెంట్ చేయడంలో లింగుస్వామి సక్సెస్అయ్యారని చెప్పొచ్చు. హీరో ఇంటర్వెల్ వరకూ డాక్టర్ గా కనిపించి .. ఆ తరువాత నుంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడమే ఈ కథలోని కొత్త పాయింట్.

ఎనర్జిటిక్ హీరో రామ్ అంటే సినిమాపై అంచనాలు ఉండటం కామనే. అది కూడా ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల ప్రభావం వల్ల రామ్ పై ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఎప్పటిలాగే ఈసినిమలో కూడా రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో రెచ్చిపోయాడు. ఈ సినిమాకు ప్రధాన బలం హీరో రామ్ మాత్రమే. సత్య పాత్రలో రామ్ పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అయితే రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఎనర్జిటిక్ గా చేసేశాడు. అలాగే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే రామ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ గా అదరగొట్టాడు. మొదటిసారి రామ్‌ కి కూడా ఈ చిత్రంతో పోలీస్ గా నటించే అవకాశమొచ్చింది. తన మార్క్ ఎనర్జీతో పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక మరోసారి ఆది విలన్ పాత్రలో తన నటనతో మెప్పించాడు. మర్డర్ చేసే ప్రతిసారి ఒక మొక్క నాటుతూ ఉంటాడు. ఇది కూడా కొత్తదనంలో భాగమే అనుకోవాలి. హీరోయిన్ గా కృతి శెట్టి కూడా బాగానే నటించింది. విజిల్ మహాలక్ష్మి గా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈసినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈసినిమాలోని పాటలు సగం హిట్టయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదరగొట్టేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని సీన్స్ చాలా బాగా హైలెట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫి కూడా ఈసినిమాకు మరో ప్రధానబలం అయింది. అలానే సాంకేతిక విలువలు కూడా చాలా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడే వాళ్లకి ఈసినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఇక తమిళ్ ప్రేక్షకులను కూడా రామ్ బాగానే తన నటనతో ఆకట్టుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + fifteen =