మళ్లీ కరోనా కేసులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఈనేపథ్యంలోనే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా, చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా కరోనా వల్ల సినీ పరిశ్రమకు ఎంత నష్టం జరిగిందో చూశాం. ఆర్థికంగా చాలా నష్టపోయింది. అంతేకాదు ఎంతోమంది సినీ సెసిబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఎంతో మంది కరోనా వల్ల చనిపోయిన వారు కూడా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను గోపీచంద్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: