‘గాడ్సే’ మూవీ రివ్యూ

Godse, Godse (2022), Godse Audience Review, Godse FDFS Review, Godse Film, Godse First Review, Godse First Review Out, Godse Highlights, godse movie, Godse Movie (2022), Godse Movie Censor Review, Godse Movie Critics Review, Godse Movie First Review, Godse Movie Highlights, Godse Movie Latest News, Godse Movie Latest News and Updates, Godse Movie Plus Points, Godse Movie Pre Review, Godse Movie Premiere Show Response, Godse Movie Premiere Show Review, Godse Movie Public Response, Godse Movie Public Talk, Godse Movie Review, Godse Movie Review (2022), Godse Movie Review And Rating, Godse Movie Story, Godse Movie Updates, Godse Pre Review, Godse Premiere Review, Godse Premiere Show Review, Godse Public Response, Godse Public Talk, Godse Review, Godse Review And Rating, GODSE Telugu Movie, GODSE Telugu Movie Latest News, Godse Telugu Movie Live Updates, Godse Telugu Movie Review, latest telugu movies news, Satya Dev Godse Movie Review, Satya Dev Godse Movie Review and Rating, Satya Dev Godse Movie Updates, Staya Dev Godse Movie latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest News, Tollywood Movie Updates

గోపీ గణేష్‌ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. సత్యదేవ్ నటిస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక దానికి తోడు ఈసినిమా టీజర్, ట్రైలర్ కూడా ఈసినిమాపై అంచనాలు పెంచేసింది. మరి భారీ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో.. సత్యదేవ్ కు హిట్ అందించిందో?లేదో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, సాయి కుమార్, సిజ్జు మీనన్, బ్రహ్మాజీ, ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు
దర్శకత్వం..గోపీ గణేష్‌
బ్యానర్స్.. సికే స్క్రీన్స్ బ్యానర్
నిర్మాత..సి. కళ్యాణ్
సంగీతం.. సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫి.. సురేష్‌ సారంగం

కథ..

వైశాలి (ఐశ్వ‌ర్య ల‌క్ష్మి) ఇన్వెస్టిగేష‌న్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా పనిచేస్తుంటుంది. అయితే తను ఒక కేసును డీల్ చేసే సయయంలో అగంతకులను పట్టుకునే క్రమంలో ఓ నిండు గ‌ర్బిణి ప్రాణాలు కోల్పోతుంది. ఆ ఘటనతో డిస్టర్బ్ అయిన వైశాలి.. ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల తరువాత వరుసగా ఫైనాన్స్ మినిస్టర్, పోలీస్ ఆఫీసర్లు, వాళ్ల బినామీలు వరస పెట్టి కిడ్నాప్ అవుతూంటారు. ఆ విషయం బయిటకు రాకుండా సీక్రెట్ గా డీల్ చేయమని ఓ టీమ్ ని ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. ఫైనల్ గా ఆకేసు వైశాలి వద్దకు వెళుతుంది. ఆకేసును సాల్వ్ చేసే క్రమంలో ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి మరెవరో కాదని..లండన్ నుంచి తెలుగు రాష్ట్రానికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) అనే బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. మరి అసలు ఓ బిజినెస్‌మేన్ కిడ్నాప‌ర్‌గా ఎందుకు మారాడు?త‌నెందుకు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను, వారి సంబంధిత వ్య‌క్తుల‌ను కిడ్నాప్ చేస్తాడు? వారిలో కొంద‌రిని ఎందుకు చంపేస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..

రాజకీయ నాయకులు.. అవినీతి ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈసినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే వచ్చింది. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా ఈసినిమాను రూపొందించారు. నేటి కాలంలో యువత చదువుతున్నది ఒకటైతే.. సరైన అవకాశాలు లేక చ‌దువుకు సంబంధం లేని ప‌నులు చేస్తున్నారు. అవినీతి రాజ‌కీయాల కార‌ణంగా ప్రావీణ్య‌త‌, సామ‌ర్థ్యం ఉన్న యువ‌త‌కు ప్రాధాన్య‌త త‌గ్గిపోతుంది. కుటుంబ స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్న యువ‌తీ యువ‌కులకు త‌గిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండ‌టం లేదు. ఇదే పాయింట్ ను తన కథతో చూపించాడు గోపి. గోపీ గణేష్ రాసుకున్న డైలాగులు. సిస్టమ్ ను ఎదిరించే డైలాగులు మాత్రం బాగా పేలాయి. హీరో చేత చెప్పించిన డైలాగులు చాలా వరకూ సూటిగా చాలా మంది పొలిటీషిన్స్ కు తగులుతాయి. నిజమే కదా అనిపిస్తుంది.

ఇక సత్యదేవ్ కు ఇలాంటి పాత్రలు చేయడం మాములు విషయమే. ఇప్పటివరకూ ఎన్నో విలక్షణమైన కథలతో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈసినిమాలో కూడా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే వ‌న్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు న‌డిపించారు స‌త్య‌దేవ్‌. డైలాగ్ డిక్ష‌న్‌, పాత్ర‌లోని ఇన్‌టెన్సిటినీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తీరు చాలా బావుంది. ఇక హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మీ కూడా చాలా బాగా చేసింది. తెలుగులో ఆమెకు తొలి సినిమా అయినా కూడా రెగ్యులర్ హీరోయిన్ రోల్స్‌కు భిన్నమైన రోల్‌లో నటించి మెప్పించింది. పోలీస్ రోల్‌కు తగ్గట్టు డ్రస్సింగ్ స్టైల్, యాక్టింగ్ డీసెంట్‌గా ఉన్నాయి. ఇక ముఖ్య‌మంత్రి పాత్ర‌లో చేసిన సిజ్జు మీన‌న్‌ అలానే పృథ్వీ రాజ్, ర‌వి ప్ర‌కాష్, నోయ‌ల్‌, చైత‌న్య కృష్ణ త‌దిత‌రులు అలానే గెస్ట్ అప్పియ‌రెన్స్ పాత్ర‌లో చేసిన నాగ‌బాబు ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే నేటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు లింకు పెడుతూ ద‌ర్శ‌కుడు గోపి గ‌ణేష్ ప‌ట్టాభి క‌థ‌ను రాసుకున్నాడు. ఇక కథను ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. శాండీ అద్దంకి, సునీల్ క‌శ్య‌ప్ నేప‌థ్య సంగీతం బావుంది. సురేష్ సారంగం సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాణ విలువల కూడా చాలా బాగా ఉన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nine =