‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ

Sarkaru Vaari Paata Movie Review,Sarkaru Vaari Paata Telugu Movie Review,Sarkaru Vaari Paata Review,Sarkaru Vaari Paata Movie Review And Rating,SVP Review,SVP Movie Review,SVP Telugu Movie Review,SVP Review And Rating,Sarkaru Vaari Paata Movie Plus Points,Sarkaru Vaari Paata FDFS Review,Sarkaru Vaari Paata Movie Pre Review,Sarkaru Vaari Paata Movie First Review,Sarkaru Vaari Paata First Review Out,Sarkaru Vaari Paata Movie Critics Review,Sarkaru Vaari Paata Movie Public Talk,Sarkaru Vaari Paata Movie Public Response,Sarkaru Vaari Paata Movie Highlights,Sarkaru Vaari Paata Movie Story,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata (2022),Sarkaru Vaari Paata Movie Review (2022),Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Movie Latest News and Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Review,Mahesh Babu Sarkaru Vaari Paata Review,Sarkaru Vaari Paata Movie Latest News,Sarkaru Vaari Paata Telugu Movie Latest News,Sarkaru Vaari Paata Telugu Movie Live Updates,Sarkaru Vaari Paata Highlights,Sarkaru Vaari Paata Public Response,Mahesh Babu,Keerthy Suresh,Thaman S,Parasuram

మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది. మహేష్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్లు అయిపోయింది. దీంతో అభిమానులు సర్కారు వారి పాట సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పేశారు. ఇక నేడు భారీ అంచనాల మధ్య ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్ర ఖని, వెన్నెల కిషోర్, నదియా, సుబ్బరాజు,అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళీ, మహేష్ మంజ్రేకర్, రవి ప్రకాశ్, సత్యం ప్రకాశ్ తదితరులు
దర్శకత్వం.. పరుశురాం
బ్యానర్స్.. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు..నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట
సంగీతం.. థమన్
సినిమాటోగ్రఫి.. ఆర్ మది

కథ..

మహేష్ బాబు (మహేష్) వడ్డీ వ్యాపారీ. తనకు ఒక మహీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనే ఫైనాన్స్ షాపు ఉంటుంది. దాని ద్వారా అందరికీ డబ్బులు వడ్డీకి ఇస్తుంటాడు. కాకపోతే చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు మహీ. అందుకే తను ఇచ్చిన టైమ్ లోపు డబ్బులు ఇవ్వకపోతే ఎలా అయినా సరే డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఈనేపథ్యంలోనే యూఎస్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడే మహీకి కళావతి (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. తన చదువు కోసం మహీ నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకుంటుంది. మహీ కూడా మొదటి చూపుతోనే కళావతి ప్రేమలో పడతాడు. ఇలా సాగుతుండగా అనుకోకుండా వ్యాపారవేత్త సముద్రఖని(రాజేంద్రనాథ్)తో మహీకి గొడవ జరుగుతుంది. రాజేంద్రనాథ్ కు, మహీకి మధ్య వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది..? రాజేంద్రనాథ్ కు, మహీ తండ్రికి ఉన్న సంబంధం ఏంటి? అసలు మహీ చిన్నప్పుడు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ..

శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస సూపర్ హిట్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు మహేష్ బాబు. ఈ మూడు సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇక ఈసినిమాపై కూడా మొదటి నుండే మంచి అంచాలు ఉన్నాయి. అంతేకాదు మొదటినుండీ ఈసినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు సినిమాకు కూడా అదే టాక్ వస్తుంది. ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది ఈసినిమా. ఇక ఈసినిమాలో మహేష్ ది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈసినిమాలో మహేష్ బాబు మేకోవర్ దగ్గర నుండి, నటన, యాటిట్యూడ్ అన్నీ చేంజ్ చేశాడు. మహేశ్ మాస్ డైలాగ్స్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది.

ఇక హీరోయిన్ గా చేసిన కీర్తి సురేష్ ది ఈసినిమాలో కాస్త డిఫరెంట్ రోల్ అని చెప్పొచ్చు. కీర్తి సురేష్ కూడా ఇప్పటివరకూ చేసిన పాత్రలకు ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది. తను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సీరియస్ పాత్రలు లేకపోతే సైలెంట్ గా ఉండే పాత్రలు చేసింది కానీ ఇలాంటి యాక్టీవ్ పాత్రలో నటించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్బుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్ర నాథ్ పాత్రలో సముద్రఖని మెప్పించాడు. తనికెళ్లభరణి, నదియా, వెన్నెల కిషోెర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను ఇలా అందరూ కూడా పర్వాలేదనిపించారు. మహేష్ బాబు తండ్రిగా ఫ్లాష్ బ్యాక్‌లో ఓ రెండు మూడు నిమిషాలు కనిపించే సీన్‌లో నాగబాబు మెప్పించాడు.

డైరెక్టర్ పరుశురాం గురించి కూడా చెప్పుకోవాలి. మహేష్ ను కొత్తగా, యాక్టీవ్ గా చూపించాడు. మహేష్ గత నాలుగు సినిమాల నుండి డీసెంట్ గా కామ్ కంపోజ్డ్ పాత్రల్లోనే నటిస్తున్నాడు. అయితే ఈసినిమాలో మహేష్ ను కొత్తగా చూపించాడు. ఇక సోలో సినిమా కానీ గీతా గోవిందం సినిమా కానీ చూస్తే అర్థమవుతుంది. పరుశురాం రైటింగ్ స్కిల్స్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కామెడీ సన్నివేశాలు అలానే ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎలా చూపించాలో తెలుసు. దానితో పాటు సామాన్యుల మీద బ్యాంకుల ప్రతాపం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈసినిమా ద్వారా చూపించాడు. రైతులు, సాధారణ ప్రజలు, మధ్య తరగతి వాళ్ల మీద బ్యాంకులు చూపించే ప్రతాపం.. వేల కోట్ల ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చురకలు అంటించారు. కొంత మంది వేలకోట్లు ఎగవేస్తే.. వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయ్ అని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు ప్రధాన బలం థమన్ అందించిన సంగీతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా పాటలు ఇప్పటికే ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చూశాం. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించాడు. ఈసినిమాలో కూడా అదే రేంజ్ లో ఈసినిమాకు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా చూపించారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఈసినిమా చూసి ఎంజాయ్ చెయ్యోచ్చు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =