‘భళా తందనాన’ మూవీ రివ్యూ

Bhala Thandhanana Movie Review,Bhala Thandhanana Telugu Movie Review,Bhala Thandhanana Review,Bhala Thandhanana,Bhala Thandhanana Movie,Bhala Thandhanana Telugu Movie,Bhala Thandhanana First Review,Bhala Thandhanana Movie Public Talk,Bhala Thandhanana Movie Public Response,Bhala Thandhanana Movie Live Updates,Bhala Thandhanana Movie Story,Bhala Thandhanana Movie Highlights And Plus Points,Sree Vishnu,Catherine,Mani Sharma,Chaitanya Dantuluri,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews,Telugu Movies 2022,Telugu Filmnagar,Bhala Thandhanana Telugu Movie Public Talk,Bhala Thandhanana Public Response,Bhala Thandhanana Public Talk,Bhala Thandhanana Movie Public Talk And Public Response,Bhala Thandhanana Telugu Movie Review And Rating,Bhala Thandhanana Movie Review And Rating,Bhala Thandhanana Movie Rating,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu Bhala Thandhanana Movie Review,Sree Vishnu Bhala Thandhanana Movie,Sree Vishnu Bhala Thandhanana,Bhala Thandhanana Movie Updates,Bhala Thandhanana Movie Live Updates,Bhala Thandhanana Telugu Movie Latest News,Sree Vishnu Latest Movie,#BhalaThandhanana,#BhalaThandhananaReview

‘బాణం’ ఫేమ్‌ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. మొదటి నుండి శ్రీవిష్ణు కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తాడు కాబట్టి ఈసినిమై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్రరాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్, శ్రీ‌నివాస రెడ్డి త‌దిత‌రులు
దర్శకత్వం.. దంతులూరి చైతన్య
బ్యానర్..వారాహి చలన చిత్రం బ్యానర్
నిర్మాత.. సాయి కొర్రపాటి
సంగీతం.. మణిశర్మ
సినిమాటోగ్రఫి.. సురేష్ రగుతు

కథ

శశిరేఖ(కేథరిన్‌) ఓ సిన్సియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఓ అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకొని.. ఆ న్యూస్‌ కవర్‌ చేయడానికి అక్కడికి వెళ్తుంది. అయితే అక్క‌డే అకౌంటెంట్ గా ప‌నిచేస్తున్న చంద్ర‌శేఖ‌ర్ (శ్రీ విష్ణు) ఆమెను ఎలాగైనా మేనేజ్ చేయ‌మ‌ని.. ఈ న్యూస్ బ‌య‌ట‌కు రాకుండా చూడ‌మ‌ని అందుకు డబ్బులు కూడా ఇస్తానని చెబుతాడు. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్‌ ఆనంద్‌ బాలి(గరుడ రామ్‌) మనుషులు కావడంతో.. ఈ కేసుని సీరియస్‌ తీసుకొని స్టడీ చేస్తుంది శశిరేఖ. ఈ క్రమంలో ఆనంద్‌ బాలి దగ్గర ఉన్న రూ.2000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్తను తన మీడియా సంస్థలో ప్రచురించి ప్రపంచానికి తెలియజేస్తుంది శశిరేఖ. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ రూ.2000 కోట్లను దొంగిలించిదెవరు? ఈ దొంగతనం కేసుతో చందుకి ఉన్న సంబంధం ఏంటి?అనేదే మిగతా కథ

విశ్లేషణ..

చాలా గ్యాప్ తరువాత చైతన్య ఈసినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాణం, బసంతి చిత్రాల తర్వాత చాలా కాలం తర్వాత ఈసినిమాను తెరకెక్కించాడు చైతన్య. అయితే ఈసారి క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో వచ్చేశాడు. ఇక క్రైమ్ కు తోడు కాస్త కామెడీని, లవ్ స్టోరీని యాడ్ చేశాడు.
ఫస్టాఫ్‌లో ఓ కిడ్నాప్‌ జరగడం..దానిని కనెక్ట్‌ చేస్తూ అసలు కథను ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మలచడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. సెకండాఫ్‌లో కథంతా రూ. 2000 కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. వరుస హత్యలు, మనీ హవాలా నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించి అది ఎగ్జిక్యూట్ చేయడంలో సఫలమయ్యాడు.

శ్రీవిష్ణు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసే సినిమాల్లో ఏదో ఒక డిఫరెంట్ ఉండేలా చూసుకుంటాడు. తను చేసే సినిమాలు హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అన్న సంగతి పక్కన పెడితే తను చేసే పాత్రలు మాత్రం గుర్తుండిపోతాయి. ఇక ప్రేక్షకులు కూడా అందుకే శ్రీవిష్ణు సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎప్పటిలాగే శ్రీవిష్ణు ఈసినిమాలో కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయకంగా ఉండే పాత్రలో, సెకండాఫ్‌లో ఢిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. ఇక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా కేథరిన్‌ తన నటనతో మెప్పించింది. కె.జి.యఫ్ లో విలన్‌గా అదరగొట్టిన గరుడ రామ్‌ ఈసినిమాలో కూడా మెప్పించాడు. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి ఒదిగిపోవడమే కాకుండా..తనదైన కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధానబలం మణిశర్మ సంగీతం. పాటల సంగతి పక్కన పెడితే బీజియం మాత్రం హైలెట్ అని చెప్పాలి. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సురేశ్‌ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. శ్రీవిష్ణు సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈసినిమాను ఎలాగూ చూస్తారు.. దీనితో పాటు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nine =