‘బీస్ట్’ తెలుగు మూవీ రివ్యూ

Beast Telugu Movie Review

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా బీస్ట్. ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. దానికితోడు ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు అలానే టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. విజయ్ మరో హిట్ ను సొంతం చేసుకున్నాడా..? లేదా..? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు తదితరులు
దర్శకత్వం.. నెల్సన్ దిలీప్ కుమార్
బ్యానర్.. సన్ పిక్చర్స్
సంగీతం.. అనిరుధ్
సినిమాటోగ్రాఫర్..మనోజ్ పరమహంస

కథ..

వీర రాఘవన్ (విజయ్) సీక్రెట్ గా పనిచేసే ఒక రా ఏజెంట్. ఏ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినా సక్సెస్ చేస్తూంటాడు. అయితే ఒకసారి తను చేసే ఆపరేషన్ లో చిన్న తప్పువల్ల ఓ చిన్నారి చనిపోతుంది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తన వృత్తిని సైతం వదిలిపెడతాడు. మరోవైపు తన డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకునే భాగంగా ప్రీతి (పూజాహెగ్డే) ను కలుస్తాడు. ఇక అలా వారిద్దరూ ప్రేమలో పడతారు. ఇలా సాగుతుండగా ఈస్ట్ కోస్ట్ మాల్ ని టెర్రరిస్ట్ లు తమ అండర్ లోకి తీసుకుంటారు. అక్కడికి వచ్చిన 150 మంది జనాలను హోస్టేజీలుగా పట్టుకుంటారు. తమ లీడర్ ఉమర్ పరూఖ్ ని విడుదల చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అయితే ఆ మాల్ లోనే ప్రీతి కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీరరాఘవన్ మళ్లీ తన స్కిల్స్ ను ఎలా ఉపయోగించాడు.. పరిస్థితులను ఎలా కంట్రోల్ చేశాడు? టెర్రరిస్ట్ ల భారీ నుండి హోస్టేజీలను ఎలా కాపాడాడు అన్నది ఈసినిమా కథ..

విశ్లేషణ

విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎన్నో ఏళ్లుగా తన నటన చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి రా ఏజెంట్ పాత్రలు కూడా గతంలో విజయ్ చేసినవే. అయితే మళ్లీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాడు అన్నదే మెయిన్ పాయింట్. ఎప్పటిలాగే విజయ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలీష్ లుక్స్‌తోనే సినిమాను నడిపించేశాడు. ఇక విజయ్ మ్యానరిజం, స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పిస్తాయి. ఇక ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా తన సెటైరికల్ డైలాగ్స్‌తో నవ్వులు పూయిస్తాడు. ఇక పూజా హెగ్డే, యోగిబాబు, కమెడియన్ పృథ్వీ వంటి వారంతా కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.

ఇక నెల్సన్ దిలీప్ కుమార్ ఈసినిమాకు డైరెక్టర్ అవ్వడంతో ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. తను గతంలో చేసిన కో కో కోకిల, డాక్టర్ సినిమాలు హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక మరోసారి ఈసినిమాతో అలరించాడు నెల్సన్. తీసుకున్నది చిన్న పాయింటే అయినా కూడా దానిని యాక్షన్ మైండ్ గేమ్ డ్రామాతో ఈసినిమాను తెరకెక్కించి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ లోనే లో డార్క్ హ్యూమర్ జోడించి ఎంటర్ టైన్ చేశాడు.

సాంకేతిక విభాగం ఈసినిమాకు మరో ప్లస్ పాయింట్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజువల్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని చక్కగా కుదిరాయి. ఇక అనిరుధ్ సంగీతం గురించి చెప్పనక్కర్లేదు. పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. మంచి విజువల్స్ అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే అభిమానులకు అలానే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =