మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘గని’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో మనకు కనిపిస్తాడు. ఇక ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అవి సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. వరుణ్ తేజ్, సయీ ముంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా తదితరులు
డైరెక్టర్.. కిరణ్ కొర్రపాటి
బ్యానర్..రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్
నిర్మాతలు..అల్లు బాబి, సిద్ధు ముద్ద
సమర్ఫణ.. అల్లు అరవింద్
సంగీతం..థమన్
సినిమాటోగ్రఫి.. జార్జ్ సి. విలియమ్స్
కథ..
గని (వరుణ్‌తేజ్)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. కానీ ఛాంపియన్ అయిన తన తండ్రి ని ఒక నెపంతో బాక్సింగ్ నుండి వెలి వేస్తారు. ఆ కారణంతో తల్లి (నదియా) బాక్సింగ్ జోలికి వెళ్లకూడదని కొడుకు గని దగ్గర మాట తీసుకుంటుంది. అయితే గని తల్లికి మాట ఇచ్చినా కూడా బాక్సింగ్ వైపే తన చూపు ఉంటుంది. తల్లికి తెలియకుండానే బాక్సింగ్ పై దృష్టి పెడతాడు. బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ అయి.. తండ్రితో పోయిన పరువుని మళ్లీ నిలబెట్టాలని చూస్తాడు. మరి తన తండ్రిపై వేయబడిన ఆ నెపం ఏంటి..? వరుణ్ బాక్సింగ్ లో ఛాంపియన్ ఎలా అయ్యాడు..? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేదే ఈసినిమా కథ..
విశ్లేషణ
ఈమధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలో వస్తున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నాము అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఆ విషయంలో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కిరణ్ కు ఇది మొదటి సినిమానే అయినా కూడా మొదటి ప్రయత్నంతోనే ఆకట్టుకున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాను యాక్షన్ లవర్స్‌కు నచ్చేలా తెరకెక్కించాడు. కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు కామెడీ సీన్స్‌తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ ఈసినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కాస్త లవ్ స్టోరీ, కామెడీ ట్రాక్ తో వెళ్లగా.. సెకండ్ హాఫ్ లో మెయిన్ యాక్షన్ ఎలిమెంట్స్ చూపించాడు కిరణ్. సెకండ్ హాఫ్ లో వచ్చే మ్యాచ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది.
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి కాస్త విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు. దానికితగ్గట్టే మంచి ఫలితాలను కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత గని తో వచ్చేశాడు. అయితే మొదటిసారి ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నాడు. ఇప్పటివరకూ మాస్ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ మూవీస్‌లో వరుణ్ తేజ్ నటించాడు కానీ.. గని లాంటి స్పోర్ట్స్ డ్రామాను మాత్రం చేయలేదు. ఇక ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో చూశాం. ఇక సినిమాలో కూడా దానికి తగిన ఫలితం కనిపిస్తుంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు. వరుణ్ తేజ్ చాలా సన్నివేశాల్లో వన్ మ్యాన్ షోగా నటించాడు. ఇక ఈసినిమాతో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా అయినా తను కూడా పరవాలేదనిపించుకుంది. ఇక ప్రత్యేక పాత్రలో నటించిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, వరుణ్ తేజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక పాత్రల్లో నటించిన జగపతిబాబు, నవీన్ చంద్ర తమ పాత్రల మేర నటించారు.
ఇక ఈసినిమాకు సంగీతం థమన్ అందించాడు. మరి ప్రస్తుతం థమన్ ఎంత ఫామ్ లో ఉన్నాడో చూస్తున్నాం.. ఎప్పటి లాగే ఈసినిమాకు కూడా థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. జార్జ్ సి విలియమ్స్ మంచి విజువల్స్ అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు అని వర్గాల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చెయొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.