మహేష్ బాబు గారాల పట్టి సితారకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుండే సితారకు మంచి క్రేజ్ ఉంది. తన వీడియోలతో, సోషల్ మీడియా అప్ డేట్స్ తో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది సితార. ఇక రీసెంట్ గా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో ఎంట్రీ కూడా ఇస్తుంది. ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ లో సితార కనిపించి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు ఆ పాటలో తన స్టెప్స్ కు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది.
ఆమె వేసిన స్టెప్పులకు మహేష్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రేమికులంతా ఫిదా అయిపోయారు. ఇక సితార కూడా అడియన్స్ కు తన సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇక తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను తన ఇన్ట్సా ద్వారా షేర్ చేస్తూ.. ఇలాంటి మెమరీస్ ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్స్ చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: