గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాధేశ్యామ్ “మూవీ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టడానికి మేకర్స్ నిర్ణయించారు. తాజాగా “రాధేశ్యామ్ “మూవీ మ్యూజికల్ టూర్ వైజాగ్ లో ప్రారంభమయ్యింది. చుట్టూ పోస్టర్స్ తో ఉన్న ఒక వాహనాన్ని సిద్ధం చేశారు. జనవరి 7వ తేదీ నుండి హీరో ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొంటారని సమాచారం. భారీ ప్రమోషన్స్ తో “రాధేశ్యామ్ “మూవీ అంచనాలను మరో స్థాయి లో తీసుకువెళ్ళడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. మీడియా కి ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
Fans Hungama Begins 🤩#RadheShyam Musical Tour Begins From Vizag 🛳️🔍
Starring #Prabhas & @hegdepooja@director_radhaa #BhushanKumar @TSeries @UV_Creations @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm pic.twitter.com/KhrMZXKYzH
— Vamsi Kaka (@vamsikaka) December 28, 2021




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.