కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న సినిమా ‘గని’ బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా పాత్ర కోసం వరుణ్ తన ఫిట్ నెస్ విషయంలో కానీ మేకోవర్ పరంగా కానీ బాాగానే కష్టపడ్డాడు. అంతేకాదు బాక్సింగ్ లో కూడా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇక ఈసినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు. ఇప్పటికే హీరోయిన్ సయీ మంజ్రేకర్, నదియా, జగపతిబాబు ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రలకు సంబంధించి పోస్టర్ లను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సయూ మాయ, నదియా మాధురి, జగపతిబాబు ఈశ్వర్ నాథ్, సునీల్ శెట్టి విక్రమాదిత్య గా ఉపేంద్ర విజయేంద్ర సిన్హా పాత్రలో నటిస్తున్నారు. ఇక నేడు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ టీజర్ లో వరుణ్ తేజ్.. అదరగొట్టాడు. రామ్ చరణ్ వాయిస్ తో యాక్షన్ ఫీస్ట్ సన్నివేశాలు, అదిరిపోయే డైలాగులు టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. బాక్సింగ్ కోసం వరుణ్ చేసే.. ప్రయత్నాలను ఈ టీజర్ లో చూపించారు. మొత్తానికి టీజర్ ఈ సినిమా పై అంచనాలను పెంచేశాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: