మారేడుమిల్లి లో ‘హనుమాన్’

Hanuman Movie Team Heads To Maredumilli For Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Hanuman,Hanuman Movie,Hanuman Telugu Movie,Hanuman Movie Shooting Updates,Hanuman Telugu Movie Shooting Latest News

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అ, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తను డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అన్న పేరును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్న సంగతి తెలిసిందే. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమైన తేజా సజ్జాతోనే హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో కొత్త జోనర్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి, పాడేరు ప్రాంతాల్లో జరుగుతోంది. ఈషెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సెస్, పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది.

కాగా `హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు ఈసినిమాను పలు భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twenty =