వకీల్ సాబ్ తెలుగు మూవీ రివ్యూ – పవన్ ఈజ్ బ్యాక్

Vakeel Saab Telugu Movie Review,Vakeel Saab Movie Review,Vakeel Saab Review,Vakeel Saab Telugu Movie Review And Rating,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Updates,Vakeel Saab Telugu Movie Updates,Vakeel Saab Telugu Movie Latest Update,Vakeel Saab Film Updates,Vakeel Saab Public Talk,Vakeel Saab Movie Public Talk,Vakeel Saab Telugu Movie Public Talk,Vakeel Saab Public Response,Vakeel Saab Movie Public Response,Vakeel Saab Telugu Movie Public Response,Vakeel Saab Telugu Movie Public Talk And Public Response,Vakeel Saab Telugu Movie Live Updates,Vakeel Saab Movie Live Updates,Vakeel Saab Movie Story,Vakeel Saab Movie Review And Rating,Vakeel Saab Review And Rating,Vakeel Saab Public Talk And Public Response,Vakeel Saab Movie Public Talk And Public Response,Vakeel Saab 2021,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Power Star Pawan Kalyan Vakeel Saab,Pawan Kalyan Vakeel Saab Telugu Movie Review,Pawan Kalyan Vakeel Saab Movie Review,Vakeel Saab Telugu Movie Latest News,Telugu Filmnagar

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా వకీల్ సాబ్. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ కు ఇది రీమేక్. తమిళ్ లో నెర్కొండ పార్వాయి సినిమా కూడా పింక్ రీమేకే. అక్కడ కూడా ఈసినిమా హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో అందులోనూ పవన్ హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను తాకిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ డీటెయిల్స్ :

కాస్ట్ : పవన్ కళ్యాణ్,శృతి హాసన్,అంజలి, నివేదా థామస్, అనన్య,ప్రకాష్ రాజ్
రైటర్ అండ్ డైరెక్టర్ : వేణు శ్రీరామ్
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,బేవ్యూ ప్రాజెక్ట్స్
ప్రొడ్యూసర్స్ : దిల్‌రాజు, శిరీష్
కో – ప్రొడ్యూసర్ : హర్షిత్ రెడ్డి
ప్రెసెంటర్ : బోనీ క‌పూర్
డి .ఓ .పి : పి. యస్ వినోద్
మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్
ప్రొడక్షన్ డిజైన్ : రాజీవన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడీ
డైలాగ్స్ : తిరు
యాక్షన్ : రవి వర్మ

కథ..

సత్యదేవ్(పవన్ కళ్యాణ్) సామాన్యులకి న్యాయం జరగాలని లాయర్ అవుతాడు. అదే సమయంలో శృతి హాసన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తన లాయర్ వృత్తిని వదిలేస్తాడు. అలా వదిలేసి హైదరాబాద్ లోని ఓ ఏరియాలకు షిఫ్ట్ అవుతాడు. మరోవైపు జరీనా (అంజలి) పల్లవి (నివేదా థామస్) అనన్య (అనన్య) ముగ్గురూ స్నేహితులు. ముగ్గురు హైదరాబాద్ లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఐతే ఒకరోజు రాత్రి పార్టీకి వెళ్లిన వారు అనుకోకుండా ఒక సంఘటన లో ఇరుక్కోవడంతో అది వారి జీవితాలను మలుపు తిప్పుతుంది. వీళ్ళ పై కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. ఆ క్రమంలో సత్యదేవ్ మళ్లీ ముగ్గురు అమ్మాయిల తరపున నిలబడి లాయర్ కోటు వేసుకుంటాడు. ఆ ముగ్గురికి సత్యదేవ్ ఎలా న్యాయం జరిగేలా చేశాడు ? బ‌ల‌మైన లాయ‌ర్ నందా (ప్రకాష్ రాజ్)ను ఎలా ఢీ కొన్నాడు ?లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.

విశ్లేషణ..

కథ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిందే. పింక్ సినిమా చూసిన వారికి కథ తెలిసే ఉంటుంది. అయితే కొన్ని కొన్ని ఎలిమెంట్స్ మాత్రం యాడ్ చేశాడు డైరక్టర్ వేణు శ్రీరామ్. పవన్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ పవన్ నుండి కొన్ని ఎలిమెంట్స్ ను కోరుకుంటారు కాబట్టి పాటలు, ఫైట్స్ లాంటివి యాడ్ చేశారు. వేణు శ్రీ రామ్ తెలుగు ప్రేక్షకుల కోసం చేసిన మార్పులు చేర్పులు అందరికీ నచ్చుతాయి. ఒరిజినల్ కథకి సోల్ అలానే ఉంచి పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేసిన విధానం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేస్తూనే కథ నుంచీ పక్కకి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.

ఇక ఈసినిమాకు ప్రధాన బలం.. బిగ్గెస్ట్ హైలైట్ పవన్ అనేది సెపరేట్ గా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటి వరకూ పవన్ చేసిన పాత్రలకు ఈ పాత్రకు కొంచం తేడా ఉంది. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల పెర్ఫామెన్స్ అంతా ఒక ఎత్తైతే వకీల్ సాబ్ లో ఆయన చేసిన మెచ్యూర్ పెర్ఫామెన్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. అటు ఎమోషనల్ సీన్స్, కాలేజ్ ఎపిసోడ్స్, కోర్టులో సీరియస్ గా ఉంటూనే మధ్యమధ్య లో వేసే సెటైర్స్ ఇలా అన్నీ షేడ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి.

మరి పవన్ కళ్యాణ్ లాంటి హీరోకు ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణ నటుడు తోడైతే ఎలా ఉంటుంది.. వీరిద్దరి మధ్య నడిచిన కోర్టు డ్రామా సినిమాకే హైలెట్ అవుతుంది. ఇక బాధిత యువ‌తులుగా అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య తమ పాత్రల్లో అద్భుతంగా న‌టించారు.

ఇక థమన్.. థమన్ ఇచ్చిన మూడు పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలుసు. మగువా మగువా పాట అయితే గత ఏడాది నుండి వినిపిస్తూనే ఉంది. ఇక పాటలు ఒక ఎత్తైతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. ప్రతి సీన్ ని మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫి కూడా బావుంది. పవన్ ను మూడు డిఫరెంట్ షెడ్స్ లుక్స్ వైజ్ గా చాలా బాగా చూపించాడు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముంది. ఈసినిమాలో కూడా అవి పుష్కలంగా కనిపిస్తాయి. మరోసారి నిర్మాతగా దిల్ రాజు కు ఉన్న సీనియార్టి ఏంటో ఈసినిమాతో ప్రూవ్ చేశాడు.

ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునే సినిమా. మూడేళ్లు ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టారు. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ ఈసినిమా నచ్చుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here