వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ – ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్

Wild Dog Movie Review,Wild Dog Telugu Movie Review,Wild Dog Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Wild Dog,Wild Dog Movie,Wild Dog Movie Public Response,Wild Dog Movie Public Talk,Wild Dog Movie Review,Wild Dog Movie Review And Rating,Wild Dog Movie Updates,Wild Dog Review,Wild Dog Review And Rating,Wild Dog Telugu Movie,Wild Dog Telugu Movie Latest News,Wild Dog Telugu Movie Public Talk,Wild Dog Telugu Movie Review And Rating,Nagarjuna Wild Dog Telugu Movie Review,Nagarjuna Wild Dog Movie Review,Nagarjuna Wild Dog Review,Nagarjuna Wild Dog Movie Review And Rating,Nagarjuna Wild Dog Movie Story,Wild Dog Movie Live Updates,Nagarjuna Wild Dog Telugu Movie Review And Rating,Nagarjuna New Movie Review,Wild Dog Film Review,Akkineni Nagarjuna Wild Dog Movie Review,Akkineni Nagarjuna

అహిషోర్ సోల్మ‌న్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్రలో కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఆమధ్య ఓటీటీలో రిలీజ్అవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈసినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఈసినిమా నాగార్జునకు హిట్ ఇచ్చిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ డీటెయిల్స్ :

మూవీ : వైల్డ్ డాగ్
నటీనటులు : నాగార్జున,దియా మీర్జా,స‌యామీ ఖేర్, అలీ రెజా, మ‌యాంక్ ప్ర‌కాశ్,ప్ర‌కాశ్ సుదర్శన్, ప్రదీప్, బిలాల్ , అతుల్ కులకర్ణి , అనీష్ కురువిళ్ళ
రైటర్ – డైరెక్టర్ : అహిషోర్ సోలమన్
ప్రొడ్యూసర్స్ : అన్వేష్ రెడ్డి , నిరంజన్ రెడ్డి
కో- ప్రొడ్యూసర్స్ : యన్ . యమ్ పాష, జగన్ మోహన్ వంచ
డి ఓ పి : షానియల్ డియో
యాక్షన్ డైరెక్టర్ : డేవిడ్ ఇస్మాలోన్ ,శ్యామ్ కౌశల్
డైలాగ్స్ : కిరణ్ కుమార్
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని
ఆర్ట్ డైరెక్టర్ : మురళి యస్ . వి
వి యఫ్ ఎక్స్ సూపర్ వైసర్ : యుగంధర్ టి
కాస్ట్యూమ్ డిసైనర్ : అశ్వంత్ బైరి
స్టంట్ కోఆర్డినేటర్ : జేశ్వ
పి ఆర్ ఓ : వంశీ శేఖర్
పబ్లిసిటి డిసైనర్స్ : అనిల్ అండ్ భాను
మార్కెటింగ్ : ఫస్ట్ షో

కథ..

విజయ్‌ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారి. ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో ఎక్స్ పర్ట్. అందుకే డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ని అంతా ‘వైల్డ్‌డాగ్‌’ అని పిలుస్తుంటారు. అయితే కొన్ని పరిస్థితుల్లో సస్పెండ్ అవుతాడు. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్‌ బేకరిలో బాంబు బ్లాస్ట్‌ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే డీఐజీ మోహన్‌ (అతుల్‌ కులకర్ణి).. విజయ్ వర్మకు కేసు భాధ్యతలు అప్పగిస్తాడు. అందుకు విజయ్ కండీషన్ కూడా పెడతాడు. ఇక తన టీమ్ తో‌ కలిసి బాంబు బ్లాస్ట్‌ కేసును దర్యాప్తు ప్రారంభిస్తుండగా.. కొన్ని కారణాల వల్ల విజయ్ ను‌ మళ్లీ సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్‌ని ఎన్‌ఐఏ అధికారులు ఎందకు సస్పెండ్‌ చేశారు? సస్పెండ్‌ అయినప్పటికీ తన టీమ్‌తో కలిసి కేసును ఎలా చేధించాడు..? అన్నది మిగిలిన కథ..

విశ్లేషణ..

నాగార్జున కూడా ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అగ్ర హీరో కాబట్టి సినిమాలు వస్తూనే ఉంటాయి.. కానీ ఇప్పుడు యంగ్ హీరోల కాంపిటీషన్ ను తట్టుకొని హిట్ కొట్టాలంటే అంత ఈజీ కాదు. ఇక ప్రయోగాలు చేయడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఈసారి వైల్డ్ డాగ్ అనే కాస్త డిఫరెంట్ స్టోరీ తో వచ్చేశాడు. సీనియర్ హీరో కాబట్టి.. ఎన్నో ఏళ్ల నుండి చూస్తున్నాం కాబట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశభక్తి గల ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు కింగ్‌ నాగార్జున. ఇక నాగ్ టీమ్ లోని మెంబర్స్ కూడా చాలా బాగా నటించారు. రా ఏజెంట్‌ ఆర్యాపండిత్‌ పాత్రలో సయామీ ఖేర్ ఆపాత్రకు బాగా సెట్ అయింది. ఛేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. అలీరెజా నిడివి ఎక్కువ ఉన్న పాత్రలో నటించాడు. విజయ్‌ వర్మ భార్య ప్రియగా దియా మిర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది. అతుల్‌ కులకర్ణి, ప్రకాశ్‌, ప్రదీప్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

ఇక కమర్షియల్ సినిమాలకు ఇలాంటి సినిమాలకు చాలా తేడా ఉంటుంది. ఓ నాలుగు లవ్ సీన్స్, ఆరు పాటలు, కామెడీ సీన్స్, ఫైట్స్ తో సినిమాను లాగించేయోచ్చు. కానీ ఇలాంటి సీరియస్ కథను చూపించాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. స్క్రీన్ ప్లే ను చాలా పర్ఫెక్ట్ గా రాసుకోవాలి. ఇందులో డైరెక్టర్ సఫలం అయ్యాడని చెప్పొచ్చు. ఫస్టాప్‌ ఎక్కువగా ఎమోషనల్‌ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం ఎక్కువగా ఫోరాట ఘట్టాలపైనే దృష్టిపెట్టాడు. సెకండాఫ్‌ అంతా చాలా సీరియస్‌, ఆసక్తికరంగా సాగుతుంది.

సినిమాలో పాటలు అయితే ఏం లేవులే కానీ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ జోనర్ లో సినిమాలను ఇష్టపడే వాళ్లకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

Watch Online Movies Here: 👇

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here