‘తెల్లవారితే గురువారం’ మూవీ రివ్యూ

Thellavarithe Guruvaram Telugu Movie Review,Thellavarithe Guruvaram Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Thellavarithe Guruvaram,Thellavarithe Guruvaram Movie,Thellavarithe Guruvaram Movie Public Response,Thellavarithe Guruvaram Movie Public Talk,Thellavarithe Guruvaram Movie Review,Thellavarithe Guruvaram Movie Review And Rating,Thellavarithe Guruvaram Movie Updates,Thellavarithe Guruvaram Review,Thellavarithe Guruvaram Review And Rating,Thellavarithe Guruvaram Telugu Movie,Thellavarithe Guruvaram Telugu Movie Latest News,Thellavarithe Guruvaram Telugu Movie Public Talk,Thellavarithe Guruvaram Telugu Movie Review And Rating,Sri Simha Thellavarithe Guruvaram Telugu Movie Review,Sri Simha Thellavarithe Guruvaram Movie Review,Sri Simha Thellavarithe Guruvaram Review,Sri Simha Thellavarithe Guruvaram Movie Review And Rating,Sri Simha Thellavarithe Guruvaram Movie Story,Thellavarithe Guruvaram Movie Live Updates,Sri Simha

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘తెల్లవారితే గురువారం’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈసినిమా థియేటర్ లోకి వచ్చేసింది. మరి ఈసినిమా శ్రీసింహా కు హిట్ ఇచ్చిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ డీటెయిల్స్ :

మూవీ : తెల్లవారితే గురువారం
కాస్ట్ : శ్రీ సింహా,మిషా నారంగ్‌, చిత్రా శుక్లా,రాజీవ్ క‌న‌కాల‌, స‌త్య, అజ‌య్‌, వైవా హ‌ర్ష
డైరెక్టర్ : మణికాంత్ గెల్లి
ప్రొడ్యూసర్స్ : ర‌జనీ కొర్రపాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పనేని
బ్యానర్స్: వారాహి చలన చిత్రం,లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
మ్యూజిక్ : కాలభైరవ
సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు
రైటర్ : నాగేంద్ర పిళ్ల
ఎడిటర్ : సత్య గిడుతూరి
మ్యూజిక్ లేబుల్ : మ్యాంగో మ్యూజిక్
డిజిటల్ ప్రమోషన్స్ : వ్యాకెడ్ అవుట్ మీడియా

కథ..

అసలు కథ ఏంటంటే ఎంగేజ్ మెంట్ తోనే సినిమా మొదలవుతుంది. శ్రీసింహా హీరోయిన్ మిషాకు ఎంగేజ్ మెంట్ అవుతుంది. అయితే ఇద్దరికీ పెళ్లి అంటే ఇష్టముండదు..అప్పటికే శ్రీసింహా కు మరో లవర్ ఉండటం.. మరోవైపు మిషాకు పెళ్లి, భర్త పై మంచి అభిప్రాయం లేకపోవడంతో పెళ్లికి ముందు రాత్రి ఇద్దరూ పారిపోవాలనుకుంటారు. ఇద్దరూ ఎవరికి వారు పారిపోతుండగా ఆక్రమంలో ఇద్దరూ ఒకరికొకరు ఎదురవుతారు. ఫైనల్ గా ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి కలిసి పారిపోతారు. ఈ జర్నీలో ఇద్దరూ తమ ఫ్లాష్ బ్యాక్ ను చెప్పుకుంటారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుంది..? శ్రీసింహా, మిషా ఇద్దరి పెళ్లి జరిగిందా లేదా..? శ్రీసింహా లవర్ స్టోరీ ఏమైంది..? ఇవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ..

ఈసినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ మణికాంత్ స్క్రీన్ ప్లే గురించి సినిమా మొదలైనప్పటినుండి ఎండ్ కార్డ్ పడేవరకూ ఎక్కడా బోరు కొట్టించకుండా చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా కథ ను రాసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ కు ఫుల్ మార్కులు పడినట్టే.ఈసినిమా తరువాత డైరెక్టర్ కు మంచి అవకాశాలే వచ్చేలా కనిపిస్తున్నాయి.

ఇక కథకు తగ్గట్టు శ్రీసింహా ఈసినిమాలో తన నటనతో మరో మెట్టు ఎక్కేశాడు. మొదటి సినిమాలో కొన్ని సీన్లలో కొంచం ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కాస్త అటు ఇటుగా అనిపించాడు కానీ ఈసినిమాకు మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యాడని తన నటన చూసి చెప్పొచ్చు. తమ కామెడీ టైమింగ్ తో చాలా బాగా చేశాడు. శ్రీసింహా తో పాటు హీరోయిన్లుగా చేసిన మిషా.. అలానే చిత్రా శుక్లా కూడా సినిమాకు ప్రధాన బలం. మిషా కు ఇది మొదటి సినిమా అయినా సీరియల్స్ అంటే పిచ్చి ఉన్న ఒక అమ్మాయి పాత్రలో.. సీరియల్స్ చూసి భర్త అంటే ఇలానే ఉంటాడు అని అనుకునే పాత్రలో చాలా సహజంగా నటించింది. ఇక చిత్రశుక్లా ఇప్పటికే పలుతెలుగు సినిమాల్లో నటించింది కానీ ఈసినిమాలో పాత్ర మాత్రం ఆమెకు ఖచ్చితంగా గుర్తిండిపోవడమే కాకుండా.. మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. శ్రీసింహా కు టిపికల్ గర్ల్ ప్రెండ్ గా చిత్ర శుక్లా చేసిన నటనకు చాలా మంది కనెక్ట్ అవుతారు.

ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్య కామెడీ గురించి. ఇటీవల కాలంలో సత్య కు మంచి మంచి రోల్స్ పడుతున్నాయి. మొన్నటికి మొన్న గాలిసంపత్ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఇప్పుడు ఈసినిమాలో కూడా సత్యకు మంచి రోల్ దక్కింది. ఎవరి మాట వినని పాత్రలో.. గోదావరి యాసలో మాట్లాడుతూ సినిమా మొత్తం తమ కామెడీ తో నవ్విస్తూ ఆద్యంతం అలరించాడు. సింహా మొదటి సినిమా మత్తువదలరా లో సత్య ఎలా అయితే హైలెట్ అయ్యాడో ఈసినిమాతో మరోసారి శ్రీసింహా కు కలిసొచ్చాడు. మిగిలిన నటీనటులు రాజీవ్ క‌న‌కాల‌, స‌త్య, అజ‌య్‌, వైవా హ‌ర్ష, శ‌ర‌ణ్యా ప్రదీప్‌, గిరిధ‌ర్‌, ప్రియ‌, ర‌వివ‌ర్మ, పార్వతి, సిరి హ‌నుమంత్‌, మౌర్య, ప‌ద్మావ‌తి వారి పాత్రల మేర నటించారు.

ఇక సత్యతో పాటు శ్రీసింహాకు రెండో సినిమాకు లక్కీ ఛామ్ అయింది అన్న కాలభైరవ. తండ్రికి తగ్గట్టే కాలభైరవ కూడా డిఫరెంట్ మ్యూజిక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. మత్తువదలరా సినిమాకు ఎలా అయితే మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచిందో ఈసినిమాకు కూడా కాలభైరవ సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయింది. ఇక సినిమాటోగ్రఫి.. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే శ్రీసింహా ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్టే అనిపిస్తుంది. పెద్ద హడావుడి లేకుండా వచ్చిన ఈ క్యూట్ లవ్ స్టోరీని ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fourteen =