గతకొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. దీనిలో భాగంగానే ఇప్పుడు మోసగాళ్ళు అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. పేదరికం నుండి బయటపడాలనుకునే హీరో ప్రపంచంలోనే రెండువేల ఆరువందల కోట్ల అతిపెద్ద స్కామ్ చేసి దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడనేది ‘మెసగాళ్లు’ కథ అని అర్థమవుతుంది. కొత్త ఎత్తులు వేస్తూ మంచు విష్ణు డబ్బులు కొల్లగొట్టడం.. సునీల్ శెట్టి గ్యాంగ్ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైలర్‌లోని సన్నివేశాలతో పాటు డైలాగ్స్ కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. లక్ష్మీ దేవి అంత రిచ్ ఎందుకో తెలుసా, నాలుగు చేతులతో సంపాదిస్తుంది కాబట్టి అని కాజల్ చెప్పిన డైలాగ్‌తో పాటు డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేమి కాదని రుహానీ చెప్పిన డైలాగ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమాతో మంచు విష్ణు హిట్ కొట్టేలాగనే కనిపిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: