2019 లో టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరెవరు ఏం చేస్తున్నారు?

Latest Telugu Movies News, Telugu Actors Upcoming Movies In 2019, Telugu Film News 2018, Telugu Filmnagar, Telugu Movies In 2019, Tollywood Cinema Updates, Tollywood Top Stars Upcoming Films, Tollywood Top Stars Upcoming Movies In 2019, Upcoming Telugu Movies In 2019
Tollywood Top Stars Upcoming Movies In 2019

వందల రూపాయల్లో రోజువారీ కూలి పని చేసుకుని పొట్టపోసుకునే కార్మిక శ్రామిక వర్గాలే కాదు… కోట్లల్లో సంపాదన ఉండే సినీ స్టార్స్ కూడా ప్రతిరోజు పని చేయాల్సిందే. చేసే పనిలో దానికి దక్కే ప్రతిఫలంలో తేడా ఉండవచ్చేమోగానీ “రెక్కాడితే గానీ డొక్కాడదు” అనే సామెత అందరికీ వర్తిస్తుంది. పొద్దున లేస్తే ఎవడి పొట్ట తిప్పలకు వాడు పరుగులు పెట్టాల్సిందే.

పని లేకపోవటం వేరు… పని చేయకపోవడం వేరు… పని లేక పోవటాన్ని ‘నిరుద్యోగం’ అంటారు. పని ఉన్నా చేయకపోవటాన్ని ‘పనికిమాలిన తనం’అంటారు. కాబట్టి పనికిమాలినవాడు అనిపించుకోవటం ఇష్టంలేని ప్రతి ఒక్కరూ పని కోసం పరుగులు పెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో “రెక్కాడితే గాని డొక్కాడదు” అనే సామెత మన టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా వర్తిస్తుంది కాబట్టి మన స్టార్స్ 2019 – డైరీ ఎలా ఉందో.. 2019 లో ఎవరెవరు ఏ ఏ సినిమాలు చేస్తున్నారో చూద్దాం.

2018లో ఒక్క రిలీజ్ కూడా లేని స్టార్స్ 2019లో భారీ అంచనాలతో వస్తున్నారు.2018 లో అద్భుత విజయాలతో దుమ్ముదులిపిన వాళ్ళ తో పాటు ఫ్లాపులతో డీలాపడిన వాళ్ళు కూడా 2019 లో తమ అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకోబోతున్నారు. మొత్తానికి work is worship అనే సూత్రాన్ని గౌరవిస్తూ 2019కి స్వాగతం చెబుతూ కార్యోన్ముఖులు అవుతున్న మన టాలీవుడ్ తారల 2019 డైరీలోకి
ఒకసారి తొంగి చూద్దాం.

చిరంజీవి:

మెగాస్టార్ చిరంజీవికి 2018లో రిలీజ్ లేదు. అత్యంత భారీ స్థాయిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ” సైరా నరసింహ రెడ్డి” చిత్ర నిర్మాణానికి రెండేళ్లు పైనే పడుతున్న కారణంగా మెగాస్టార్ కు 2018 no film ఇయర్ గా గడిచిపోయింది. కాగా ‘సైరా’ 2019 ద్వితీయార్ధం లో మాత్రమే రిలీజ్ అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వలన తన కేరెక్టర్ వర్క్ పూర్తిచేసుకున్న తరువాత చిరంజీవి ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లోనే తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇంతకూ ఆ తదుపరి సినిమా ఏమిటి? మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన “వినయ విధేయ రామా” ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేసుకున్నట్లుగా స్వయానా మెగాస్టార్ చిరంజీవే ప్రకటించారు. కాబట్టి 2019లో మెగాస్టార్ చిరంజీవికి ఒక రిలీజ్ , రెండు ఓపెనింగ్స్ ఉంటాయి. సో.. మెగాస్టార్ 151 రిలీజ్,152 అండ్ 153ల ఓపెనింగ్స్ తో మెగా అభిమానులకు పండగే పండగ.

బాలకృష్ణ:

2018 కి “జై సింహ” ద్వారా ప్రారంభ విజయాన్ని అందించిన నందమూరి నటసింహం బాలకృష్ణ 2019 కి కూడా ఘన విజయంతో స్వాగతం పలకనున్నారు.2019 జనవరి 9న విడుదల కానున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” తో ఈ సంవత్సరం ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న బాలకృష్ణ ఫిబ్రవరి 7న “ఎన్టీఆర్ మహా నాయకుడు” గా రానున్నారు. ఈ రెండు రిలీజ్ ల తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తాజా చిత్రం ప్రారంభం కానుంది. ఎంత భారీ చిత్రాన్నయినా అత్యంత వేగంగా తీసే దర్శకుడుగా బోయపాటికి మంచి పేరుంది. కాబట్టి 2019లో బాలకృష్ణకు మూడు రిలీజ్ లతో పాటు మరొక తాజా చిత్రం ఓపెనింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోకు ఒక క్యాలెండర్ ఇయర్ లో మూడు రిలీజ్ లు, ఒక ఓపెనింగ్ ఉండటం సంథింగ్ రేర్ అండ్ గ్రేట్ అనుకోవచ్చు.

నాగర్జున:

2018లో ఆఫీసర్, దేవదాస్ అనే రెండు రిలీజ్ లు కలిగి ఉన్న నాగార్జున కు 2019లో ఎన్ని సినిమాలు ఉంటాయో చెప్పటం కొంచెం కష్టంగా కనిపిస్తోంది. హిందీలో నాగార్జున చేస్తున్న” బ్రహ్మాస్త్ర” 2019 డిసెంబర్ 20 న కానీ విడుదల కాదు. ఇక తెలుగులో ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో “మన్మధుడు 2″, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ” “బంగార్రాజు” చిత్రాలు ఉంటాయి. అయితే వీటిలో ఏది ముందు ఏది వెనుక అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నాగార్జున చేస్తున్న మల్టీ స్టారర్ బైలింగ్వల్ ఫిలిం” రుద్ర” బహుశా ఉండకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి 2019లో నాగర్జున నుండి ఎన్ని సినిమాలు వస్తాయో ఇప్పుడే చెప్పలేము.

వెంకటేష్:

జనవరి 12న వెంకటేష్- వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 2 విడుదలవుతుంది. అలాగే తన మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో బాబీ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న ” వెంకీ మామ” మిడ్ ఆఫ్ ది ఇయర్ లో రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే మరో సినిమాలో కూడా వెంకటేష్ నటించనున్నారు. కాబట్టి 2019లో వెంకటేష్ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

మహేష్ బాబు:

2018లో ” భరత్ అనే నేను” చిత్రం ద్వారా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ రెవిన్యూ సాధించిన మహేష్ బాబు 2019 లో తన 25వ సినిమా ” మహర్షి” తో వస్తున్నారు. అగ్ర నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, పొట్లూరి వి ప్రసాద్ సంయుక్తంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న ” మహర్షి” ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న తాజా చిత్రం మే లో ప్రారంభం కావచ్చు. దీంతో 2019 లో మహేష్ బాబు కు ఒక రిలీజ్, ఒక ఓపెనింగ్ ఉంటాయి.

ఎన్టీఆర్:

2015లో టెంపర్, 2016లో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, 2017 లో జైలవకుశ, 2018లో అరవింద సమేత వీర రాఘవ- ఇలా వరుసగా ఐదు విజయాలను తన ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ ముంగిట నిలిచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 2019 లో no release . రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న RRR నిర్మాణం 2019 మొత్తం కొనసాగడంతో ఈ సంవత్సరం తనకు రిలీజ్ లేదు.

ప్రభాస్:

ఐదు సంవత్సరాల కాలాన్ని బాహుబలి సిరీస్ కోసం వెచ్చించి ఆల్ ఇండియా టాప్ స్టార్ గా పాపులారిటీ సాధించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు 2018 ‘నో రిలీజ్’ ఇయర్ గా గడిచిపోయింది. కాగా2019 ఆగస్టు 15న సుజిత్ డైరెక్షన్ లో యు.వి.క్రియేషన్స్ నిర్మించిన త్రిభాషా చిత్రం “సాహో” విడుదలవుతుంది.
మరోవైపు గోపీకృష్ణ మూవీస్- యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటారు ప్రభాస్.

రామ్ చరణ్:

2018లో ” రంగస్థలం” ద్వారా మరో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా తన కెరీర్ బెస్ట్ హిట్ సాధించిన రామ్ చరణ్ 2019 జనవరి 11న బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి వి వి దానయ్య నిర్మించిన ” వినయ విధేయ రామ” ద్వారా సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న RRR షూటింగ్ సంవత్సరం మొత్తం జరుగుతుండటంతో 2019లో హీరోగా తనకు మరొక రిలీజ్ ఉండదు. అయితే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న” సైరా నరసింహారెడ్డి” తో మరోమారు నిర్మాతగా ఒక ప్రతిష్టాత్మక చిత్రంతో వస్తున్నారు రామ్ చరణ్. దీంతో 2019లో హీరోగా ఒక సినిమా, నిర్మాతగా ఒక సినిమాతో రామ్ చరణ్ హవా కొనసాగుతుంది.

అల్లు అర్జున్:

మంచి కథా కథనాలతో, మిలటరీ నేపథ్యంతో, హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ తో వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ” నా పేరు సూర్య” ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో 2018 ఈ స్టైలిష్ స్టార్ స్పీడ్ కు కొంచెం బ్రేక్ పడింది. కథల విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం కోసం దాదాపు 9 నెలల పాటు నిరీక్షించిన అల్లు అర్జున్ ఈరోజు తన తాజా చిత్రం తాలూకు తాజా ప్రకటనను విడుదల చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించే చిత్రాన్ని తన అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈరోజు ప్రకటించారు అల్లు అర్జున్. ఈ సినిమా షూటింగ్ తో 2019లో అల్లు అర్జున్ బిజీ గా ఉంటారు. ఇక ఈ సినిమా రిలీజ్ 2019 లోనే ఉంటుందా లేక 2020 సంక్రాంతికి ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ:

అనూహ్యంగా తారాపథంలోకి దూసుకు వచ్చిన విజయ్ దేవరకొండకు 2018 అద్భుత విజయాలను అందించగా 2019 మరింత prosperous గా స్వాగతం పలుకుతోంది. గత సంవత్సరం మహానటి, గీత గోవిందం, టాక్సీ వాలా చిత్రాల విజయంతో వన్ ఆఫ్ ది టాప్ స్టార్స్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ 2019 మే లో భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “డియర్ కామ్రేడ్” చిత్రంతో వస్తున్నారు. అలాగే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న మరో చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇవి 2019లో టాలీవుడ్ లోని అగ్రతారల డైరీ వివరాలు, విశేషాలు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here