టాలెంటెడ్ బ్యూటీకి మ‌రో మెగా ఆఫ‌ర్‌?

Talented Beauty To Act With Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Actress Sneha Next Movie With Megastar Chiranjeevi,Heroine Sneha to Act With Mega Star Chiranjeevi,Sneha Upcoming Movie With Megastar Chiranjeevi,Actress Sneha New Movie With Chiranjeevi
Talented Beauty To Act With Megastar Chiranjeevi

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన నిన్న‌టి త‌రం క‌థానాయిక‌ల్లో స్నేహ ఒక‌రు. పెళ్ళ‌య్యాక‌… క‌థానాయిక పాత్ర‌ల‌కు దూర‌మైన ఈ హోమ్లీ హీరోయిన్‌… గత కొంత‌కాలంగా ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో క‌నిపిస్తూ అల‌రిస్తోంది. ఆ మ‌ధ్య‌… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన స్నేహ‌… ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బోయపాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్న `విన‌య విధేయ రామ‌` సినిమాలో ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో చ‌ర‌ణ్‌కు వ‌దిన పాత్ర‌లో క‌నిపించ‌నుంది స్నేహ‌. అంతేకాదు… మ‌రో మెగా ప్రాజెక్ట్‌లోనూ న‌టించే అవ‌కాశం ఈ టాలెంటెడ్ బ్యూటీకి ద‌క్కింద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ పిరియాడిక్ డ్రామా `సైరా న‌ర‌సింహారెడ్డి`లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట స్నేహ‌. అంతేకాకుండా… ఈ సినిమాలో ఛాలెంజింగ్‌ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. పాత్ర దృష్ట్యా వ‌య‌సు మ‌ళ్ళిన స్త్రీగా ఆమె ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే స్నేహ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here