రెండు భాగాలుగా `ట్రిపుల్ ఆర్‌`?

Ram Charan and Jr NTR RRR To Be In Two Parts?Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,#RRR Movie Latest Updates,#RRR Movie in Two Parts,RRR Telugu Movie Latest News,Director Rajamouli Making RRR in 2 Parts?
Ram Charan and Jr NTR RRR To Be In Two Parts?

`బాహుబ‌లి` సిరీస్‌… భార‌తీయ వెండితెర‌పై సంచ‌ల‌నం. అలాంటి `బాహుబ‌లి`ని తొలుత‌ ఒకే సినిమాగా తెర‌కెక్కించాల‌ని శ్రీ‌కారం చుట్టిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి… ఆ త‌రువాత రెండు రోజుల షూటింగ్ తాలూకు ర‌షెస్ చూసుకుని… క‌థా విస్త‌ర‌ణ, భారీ బ‌డ్జెట్‌, నిర్మాత‌ల శ్రేయ‌స్సు వంటి విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని రెండు భాగాలుగా తెర‌కెక్కించారట‌. ఇప్పుడు ఇదే బాట‌లో మ‌రో సినిమాని తీసుకొచ్చే ప‌నిలో ఉన్నార‌ట ఈ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే… యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో `ఆర్ ఆర్ ఆర్‌` (వ‌ర్కింగ్ టైటిల్‌) పేరుతో రాజ‌మౌళి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణకు శ్రీ‌కారం చుట్టిన రాజ‌మౌళికి… షూటింగ్ ర‌షెస్ చూసుకున్నాక… దాదాపు రూ.300 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌ వ‌చ్చింద‌ట‌. `బాహుబ‌లి` స‌మ‌యంలో ఎలాగైతే క‌థా విస్త‌ర‌ణ‌ను, నిర్మాత శ్రేయ‌స్సును, బ‌డ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారో… అలాగే `ఆర్ ఆర్ ఆర్‌`కి కూడా వ‌చ్చార‌ని ఇన్‌సైడ్ సోర్స్ టాక్‌.

1930, 2018… ఇలా రెండు టైమ్ లైన్స్‌లో జ‌రిగే ఈ సినిమా క‌థ‌ను ఒక్క భాగంగా కంటే… రెండు భాగాల్లో చూపిస్తూనే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌తో రాజ‌మౌళి ఉన్నార‌ని… అందుకే `బాహుబ‌లి` మొద‌టి భాగంకి ఎండింగ్‌లో ఎలాగైతే ఆస‌క్తిక‌ర‌మైన బ్యాంగ్ ఇచ్చారో… అదే ఫార్ములాతో ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌కి బ్యాంగ్ ఇచ్చే దిశ‌గా ఆలోచిస్తున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ఏదేమైనా… `ఆర్ ఆర్ ఆర్‌` రెండు భాగాలుగా తెర‌కెక్కితే… తార‌క్‌, చ‌ర‌ణ్‌ని తెర‌పై క‌ల‌సి చూడాల‌నుకునే వారికి ఇది డ‌బుల్ ట్రీట్ అనే చెప్పాలి. త్వ‌ర‌లోనే ఈ రెండు భాగాల‌ విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here