మ‌రో `పండుగాడు` వ‌స్తున్నాడా?

Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Puri Jagannadh To Project Ram in a Different Look,Ram Pothineni Gets a New Look in His Next Project,Hero Ram New Look For Next Movie,Actor Ram Upcoming Movies News,Ram Pothineni New Look in His Next Film,Ram Pothineni Surprises With His New Look,Ram Pothineni To Look Different and Unique in His Next Project
Puri Jagannadh To Project Ram in a Different Look

`ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో… ఆడే పండుగాడు`… `పోకిరి` సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `పోకిరి` సినిమాలో పండుగాడుగా మహేష్ బాబు చేసిన సంద‌డి… 12 ఏళ్ళు దాటినా ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో… మ‌రో `పండుగాడు`ని తీసుకొచ్చే ప‌నిలో ఉన్నాడ‌ట డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే… యువ క‌థానాయ‌కుడు రామ్ హీరోగా పూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాని వేస‌వి కానుక‌గా మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా… ఈ సినిమాలో రామ్ ఓ డిఫ‌రెంట్ లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో క‌నిపించ‌నున్నాడ‌ని… పూరి గ‌త చిత్రాల మాదిరిగానే ఇందులోనూ హీరో బాడీ లాంగ్వేజ్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా… త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన‌`పోకిరి`లోని `పండుగాడు` క్యారెక్ట‌ర్ త‌ర‌హాలో సాగే ఈ పాత్ర‌కి అదే పేరుని పెట్టాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌పై క్లారిటీ వ‌స్తుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… `పోకిరి` (2006) స‌మ్మ‌ర్ సీజ‌న్‌లోనే విడుద‌ల కాగా… రామ్‌, పూరి కాంబో చిత్రం కూడా అదే వేస‌విలో తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here