మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో అనుష్క‌?

Anushka Shetty in Another Interesting Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Anushka Upcoming Movies News,Heroine Anushka Plays Another Interesting Project,Anushka New Movie Details,Anushka Next Upcoming Film News,Anushka Silent Progress
Anushka Shetty in Another Interesting Project

ఇప్ప‌టి క‌థానాయిక‌లు గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమితం కాకుండా… ఛాలెంజింగ్ రోల్స్ చేయ‌డానికి కూడా సిద్ధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం… త‌మిళంలో న‌య‌న్ `కొలైయుదిర్ కాల‌మ్‌` చిత్రంలో మూగ‌, చెవిటి పాత్ర‌లో న‌టిస్తుంటే… అదే సినిమా హిందీ వెర్ష‌న్ `ఖామోషి`లో త‌మ‌న్నా కూడా ఆ పాత్ర‌ను పోషిస్తోంది. ఇప్పుడు వీరి బాట‌లోనే మ‌రో స్టార్ హీరోయిన్ ప‌య‌నించ‌నుంది. ఆమె మ‌రెవరో కాదు.. తెలుగువారు ముద్దుగా `జేజ‌మ్మ` అని పిలుచుకునే అనుష్క‌. దాదాపు ప‌దేళ్ళ క్రితం విడుద‌లైన `అరుంధ‌తి`తో స్టార్ డ‌మ్ పొందిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఇటీవ‌ల కాలంలో ప‌లు ఛాలెంజింగ్ రోల్స్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇక `భాగ‌మ‌తి` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న అనుష్క‌… `సైలెన్స్‌` పేరుతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న సినిమాలో ఓ విభిన్న‌మైన పాత్ర‌ను పోషించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.

`వ‌స్తాడు నా రాజు` ఫేమ్ హేమంత్ మ‌ధుక‌ర్ తెర‌కెక్కించ‌నున్న ఈ సైలెంట్ థ్రిల్ల‌ర్‌లో అనుష్క‌… అంధురాలిగా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. ఈ పాత్ర‌కి చెవుడు కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే… దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మాధ‌వ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాతో… అనుష్క న‌టిగా మ‌రింత గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here