వారం గ్యాప్‌లో రామ్ చ‌ర‌ణ్ రెండు చిత్రాలు

Ram Charan Coming Up With Back to Back Releases,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Ram Charan Upcoming Movies News,Mega Power Ram Charan Coming UP With back to Back Release,Ram Charan Back to Back Released Movies,Vinaya Vidheya Rama Movie Updates
Ram Charan Coming Up With Back to Back Releases

`రంగ‌స్థ‌లం`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌… రానున్న సంక్రాంతికి `విన‌య విధేయ రామ‌`గా అల‌రించేందుకు సిద్ధ‌మవుతున్నాడు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం జ‌న‌వ‌రి 11న తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే… అదే నెల‌లో రామ్ చ‌ర‌ణ్ మ‌రో రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే… రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌కు మ‌ల‌యాళంలో కూడా మంచి డిమాండ్ ఉంది. గ‌తంలో చ‌ర‌ణ్ న‌టించిన కొన్ని చిత్రాలు అక్క‌డ వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ఈ నేప‌థ్యంలో… ఈ ఏడాది వేస‌వి ఆరంభంలో విడుద‌లైన `రంగ‌స్థ‌లం`ని కాస్తంత ఆల‌స్యంగానైనా డ‌బ్బింగ్ చేసి… జనవరి 18న అక్క‌డ‌ రిలీజ్ చేయ‌బోతున్నారు. అలాగే `విన‌య విధేయ రామ‌` మ‌ల‌యాళ వెర్ష‌న్‌ని కూడా అదే నెల 25న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అంటే.. మ‌ల‌యాళంలో చ‌ర‌ణ్ న‌టించిన రెండు సినిమాలు కేవ‌లం వారం రోజుల గ్యాప్‌లో తెర‌పైకి రానున్నాయ‌న్న‌మాట‌. చ‌ర‌ణ్ మ‌ల్లూ ఫ్యాన్స్ కు ఇది డ‌బుల్ ధ‌మాకాగానే చెప్పుకోవాలి. ఈ రెండు చిత్రాల మ‌ల‌యాళ వెర్ష‌న్స్‌తో… చ‌ర‌ణ్ అక్క‌డ మ‌రింత క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here