స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్న కాజ‌ల్‌

Kajal to Play a Negative Character in Teja Seetha,Kajal Aggarwal Negative Role in Teja Seetha,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Kajal to Play a Negative Role,Actress kajal Movies Latest News,Kajal To play a Different Role in Her Upcoming Film,Kajal Aggarwal Teja Seetha Negative Role
Kajal Aggarwal Negative Role in Teja Seetha

`ల‌క్ష్మీ క‌ళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాల త‌రువాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకి `సీత‌` అనే పేరు ప్ర‌చారంలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… క‌థానాయిక ప్రాధాన్య‌మున్న ఈ సినిమాలో కాజ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌న్న‌మాట‌. అవుట్ అండ్ అవుట్ నెగటివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో కాజ‌ల్ క‌నిపించ‌బోతుంద‌ని టాలీవుడ్ టాక్‌. సాధార‌ణంగా… నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లంటే… అభిన‌యించ‌డానికి ఆస్కారం ఎక్కువ‌గా ఉంటుంది. బ‌హుశా… అందుకే ఈ సినిమాని కాజ‌ల్ మ‌రింత ఛాలెంజివ్‌గా తీసుకుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు… తేజ కాంబినేష‌న్‌లో చేసిన రెండు సినిమాల్లోనూ కాజ‌ల్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతోనూ న‌టిగా మ‌రింత గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి. కాగా… క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రాబోతున్న `భార‌తీయ‌డు 2`లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here