యాక్షన్ సినిమాలకు వినోదాన్ని జో్డించి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపొందించడంలో దర్శకుడు శ్రీను వైట్ల శైలే వేరు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు రూపొందించిన చిత్రాలలో ‘కింగ్’ ఒకటి. అగ్ర కథానాయకుడు నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా… శ్రీహరి, మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో కనిపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌తో పాటు… మిగిలిన పాటలు కూడా శ్రోతలను అలరించాయి. నాగార్జున కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. 2008 డిసెంబర్ 25న విడుదలైన ‘కింగ్’… నేటితో 10 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.
‘కింగ్’… కొన్ని విశేషాలు:
* దర్శకుడు శ్రీను వైట్లతోనూ, కథానాయిక త్రిషతోనూ నాగార్జునకు ఇది తొలి చిత్రం.
* దర్శకుడిగా శ్రీను వైట్లకి ‘కింగ్’ 10వ చిత్రం.
* ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… 1966లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఆస్తిపరులు’ చిత్రంలోని కథను, అలాగే… హాలీవుడ్ మూవీ ‘గుడ్‌బై ఫ్రెండ్’(1999) లోని స్టోరీ లైన్‌ను ఈ సినిమా కోసం కొంత వరకు వాడుకున్నారు.
* ఈ సినిమాలోని ‘నువ్వు రెడీ నేను రెడీ’పాటను… ‘త్రిమూర్తులు’(1987), హిందీ చిత్రం ‘ఓం శాంతి ఓం’(2007) సినిమాల్లోని పాటలను స్పూర్తిగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ పాటలో అష్ట నాయికలతో నాగార్జున ఆడిపాడడం అభిమానులను ఎంతగానో అలరించింది. చిత్ర కథానాయికలు త్రిష, మమతా మోహన్ దాస్‌తో పాటు అనుష్క, ఛార్మి, జెనీలియా, ప్రియమణి, కామ్నా జెఠ్మలాని, స్నేహా ఉల్లాల్… నాగ్ కాంబినేషన్లో సందడి చేశారు.
* నాగార్జున, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ‘మన్మథుడు’, ‘మాస్’ తర్వాత… నాగ్, డీఎస్పీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం… ఆ సినిమాల తరహాలోనే క్రిస్మస్ కానుకగానే తెరపైకి రావడం విశేషం.
* 2008లో ‘జల్సా’, ‘రెడీ’ వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత డీఎస్పీ అందించిన హ్యాట్రిక్ మూవీ ‘కింగ్’ కావడం విశేషం.
* ఒకే ఏడాదిలో ఒకే దర్శకుడి కాంబినేషన్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం దేవిశ్రీకిదే తొలిసారి.
* కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి… నాగార్జునకు బాగా కలిసొచ్చే నిర్మాత. వీరిద్దరి కలయికలో ‘విక్కీదాదా’, ‘అల్లరి అల్లుడు’, ‘సీతారామరాజు’, ‘నేనున్నాను’ లాంటి సూపర్ హిట్స్ రూపొందాయి.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=gFzi6Iudcdo]