ప్రారంభం కానున్న భీష్మ మూవీ

Bheeshma Movie Shoot to Kick Start Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Bheeshma Movie Shoot,Nithiin Bheeshma Movie Shooting,Bheeshma Movie Shooting Latest Updates,Bheeshma Movie Shooting Details,#BheeshmaMovieShoot,Nithiin New Movie Bheeshma Shooting,Bheeshma Movie Latest Updates
Bheeshma Movie Shoot to Kick Start Soon

ఛలో వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా భీష్మ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. భీష్మ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని, హీరో నితిన్ షోల్డర్ ఇంజ్యూరీ నుండి రికవర్ అవుతున్నారని, బెస్ట్ లుక్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారని, రష్మిక షూటింగ్స్ లో బిజీగా ఉన్నారని, త్వరలోనే మీ ముందుకు వస్తామని డైరెక్టర్ వెంకీ కుడుముల ట్వీట్ చేశారు.

భీష్మ సినిమాలో నటించడానికి అతృతతో ఎదురుచూస్తున్నానని, నితిన్ తో మీ షోల్డర్ ఇంజ్యూరీ గురించి తెలియదు, ఇప్పుడు ఎలాఉన్నారని రష్మిక ట్వీట్ చేశారు. బాగానే ఉన్నాను, త్వరలోనే సెట్స్ లో కలుస్తానుఅని నితిన్ రష్మిక కు రిప్లై ఇచ్చి,షూటింగ్ ఎప్పుడు అని డైరెక్టర్ ను అడుగుతూ నితిన్ ట్వీట్ చేయగా టైమ్ పట్టినా గట్టిగా కొడదాం అన్నారు గుర్తుందా, ఆ ప్రాసెస్ లోనే ఉన్నా, దిల్ సినిమా నుండి మీ అభిమానిని , అందరి దిల్ కు నచ్చేలా మన సినిమా ఉంటుందని వెంకీ కుడుముల రీ ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here