సినిమా లవర్స్ కు పండగే – సినిమా టికెట్లపై తగ్గింపు

GST Rate on Movie Tickets Reduced,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,GST Rate on Movie Tickets,GST Rate Reduced For Movie Tickets,GST Rate Cuts on Movie Tickets
GST Rate on Movie Tickets Reduced

నచ్చిన సినిమా థియేటర్ కు వెళ్లి చూడాలంటే సంపన్న కుటుంబాలకు అయితే ఓకే కానీ సామాన్య ప్రజలకు మాత్రం త‌ల‌కు మించిన భార‌మే. నెల‌కు ఒక్క‌సారి సినిమాకు వెళ్లాల‌న్నా కూడా వెళ్లిన ప్ర‌తీసారి వెయ్యి రూపాయ‌ల‌ కంటే ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అయ్యే ఛాన్స్ లేదు. అంత‌గా మండిపోతున్నాయి టికెట్ ధ‌ర‌లు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం కాస్త ఊరటనిచ్చింది.

జీఎస్టీలో కేంద్రం చేసిన కొన్ని మార్పులతో ఆకాశాన్ని అంటుతున్న సినిమా టికెట్ రేట్ల‌ు కాస్త తగ్గనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 33 వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. 28 శాతం జీఎస్‌టీ స్లాబ్‌లో ఉన్న ఏడు వస్తువులను 18శాతం స్లాబులోకి తీసుకొచ్చారు. 26 వస్తువులను 18 శాతం నుంచి 12 శాతం స్లాబులోకి మార్చారు. దీనిలో భాగంగానే వంద లోపు ఉన్న సినిమా టికెట్ ధ‌ర‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి త‌గ్గించారు. వంద పైన ఉన్న టికెట్ ధ‌ర‌పై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి త‌గ్గించారు.

దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పలువురు సినీ ప్రముఖులు దీనిపై స్పందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. జ‌న‌వ‌రి ఒక‌టి, 2019 నుంచి కొత్త జీఎస్టీ అమ‌లులోకి వ‌స్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=1-2J7avI9W8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here